Hit and run accident caught on camera woman dragged by car in mumbai

Hit-and-Run, Hit-and-Run in mumbai, Hit-and-Run car dragged women, Hit-and-Run on 8th december, Hit-and-Run caught on camera, Hit-and-Run on cc camera, Hit-and-Run on cctv, Hit-and-Run on cc cam, Hit-and-Run on early morning, Hit-and-Run women dragged by car, Hit-and-Run in mumbai goregaon, Hit-and-Run victim women stuggling for life

A woman is fighting for her life after being hit and dragged by a car in Mumbai earlier this month.

ITEMVIDEOS: సీసీ కెమెరాకు చిక్కిన రోడ్డు ప్రమాదం, ఎంతో భయానకం..!

Posted: 12/29/2014 03:45 PM IST
Hit and run accident caught on camera woman dragged by car in mumbai

సినిమా స్టంట్లను తలపించే విధంగా నిజజీవితంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలలో బాధితులు కొందరు ప్రాణాలను కొల్పోతుండగా, మరి కొందరు అవయవాలను విరగగొట్టుకుని వికలాంగులుగా బాధపడుతున్నారు. సినిమా వాళ్లు వారి బడ్జెట్ సహా వారికున్న నిడివి నేపథ్యంలో వారు కొద్దినిమిషాలకే ప్రమాదం బారిన పడిన మనిషి వ్యధను చూపిస్తుంటారు. అయితే మనిషి జీవన కాలక్రమంలో ఒక్క ప్రమాదం వారిని ఎంతగా కుంగదీస్తుందో.. ఎంతటి మనోవేదనకు గురిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మనిషి జీవితాన్నే సినిమా అనుకుని భ్రమించడం అత్యంత ప్రమాదకరం.

సినిమా వాళ్లు కూడా ఇలాంటి ప్రమాదాలను చూసే సినిమాలతో చూపిస్తున్నారా అనిపించేలా వున్న ఓ ప్రమాదం ఈ నెల 8న ముంబాయిలో సంభవించింది. ముంబాయి నగరశివార్లలోని గోరేగాంలో ఉదయం ఆరు గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొనింది. వేగంగా దూసుకువచ్చిన కారును చూసి నిశ్ఛేష్టురాలైన మహిళ కదలకుండా అక్కడే నిలబడినా.. అతివేగంగా వచ్చిన కారు అమెను ఢి కొనింది. కారు ఒక్కసారిగా ఢి కొనడంతో మహిళను కొంత దూరం వరకు ఎత్తికుదిమేసింది. అంతేకాదు మహిళను కొన్ని అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లింది.

ప్రమాదాలు చెప్పి జరగవు.. అనూహ్యంగా జరిగిన ఘటనలే. అయితే.. మానవత్వంతో స్పందించేవాడు మనిషి. కాని కారు డ్రైవర్ తాను ఎలాంటి కేసులకు దొరకకూడదని అనుకున్నాడో ఏమో, మనిషినన్న ఇంకితాన్ని మర్ఛాడు. మానవత్వానికి తిలోదకాలు ఇచ్చాడు. మహిళ అల్లంత దూరం పడగానే తగ్గిన కారు వేగం.. మళ్లీ పుంజుకుంది. తనను ఎవరు గమనించలేదని బాధితురాలి మానాన అమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనను సిసిటీవీ ఫూటేజ్ ద్వారా పసిగట్టిన పోలీసులు కారును, కారు డ్రైవర్ను గుర్తించే పనిలో పడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Road accident  mumbai  goregaon  Hit and Run  

Other Articles