Governor wants kcr naidu to end differences

Governor ESL Narasimhan, Telangana Governor ESL Narasimhan, Andhra Pradesh Governor Narasimhan, Governor to convene meeting between two telugu states, Telangana Chief Ministers K Chandrashekar Rao. Andhra pradesh Chief Ministers N Chandrababu Naidu, governor meet to resolve contentious issues.

Hoping that the New Year would bring growth and prosperity in both the States of Telangana and Andhra Pradesh, Governor ESL Narasimhan on Thursday announced that he would soon convene a meeting between Chief Ministers K Chandrashekar Rao and N Chandrababu Naidu to resolve contentious issues.

గవర్నర్ తో కేసీఆర్ గంటన్నర పాటు మంతనాలు

Posted: 01/01/2015 08:38 PM IST
Governor wants kcr naidu to end differences

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గంటన్నర పాటు ఏకాంత చర్చలు జరిపారు. గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆయన వారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పలు వివాదాస్పద అంశాలను వారు చర్చించినట్లు సమాచారం. ఎంసెట్ నిర్వహణ, ఐఏఎస్ అధికారుల కేటాయింపు తదితర అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నరు దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఇద్దరు ఉపముఖ్యమంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన గవర్నరుతో గంటన్నరపాటు ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు.

అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన సంవత్సరంలో మేలు, వృద్ది జరగాలని కాంక్షించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి విజన్ వున్న నాయకులని పేర్కోన్నారు. కొత్త రాష్ట్రాల మధ్య సమస్యలు సహజమని అయితే వాటిని రెండు రాష్ట్రాలు సమన్వయంతో చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. త్వరలో తాను రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశామై పలు వివాదాస్పద అంశాలపై సరిష్కారమార్గాన్ని కనుగోనేందుకు ప్రయత్నిస్తామన్నారు. రెండు రాష్ట్రాలో అభివృద్దిలో కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governer  KCR  Chandrababu  contentious issues.  

Other Articles