Imran khan says reports about his marriage are greatly exaggerated

former pakistan cricket captain imran khan, Cricketer turned politician imran khan, politician imran Khan, BBC anchor reham khan, imran and reham khan marriage, imrankhan rehamkhan secret marriage,

Pakistan cricketer-turned politician Imran Khan today described as “greatly exaggerated” the reports that he had secretly married TV anchor Reham Khan, a decade after he separated from his first wife.

ముగ్గురు పిల్లల తల్లితో పెళ్లి.. అతిశయోక్తే.. కాని నిజం..?

Posted: 01/02/2015 06:42 PM IST
Imran khan says reports about his marriage are greatly exaggerated

పాకిస్థాన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్, పాకిస్థాన్ తహ్రిక్ ఏ ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు తన వివాహ కథనాలపై స్పందించారు. తన భార్యతో విడిపోయిన పదేళ్ల తరువాత తాను మరోమారు తాను రహస్యంగా ోాచ వివాహం చేసుకున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాలు అతిశయోక్తిలా వున్నాయంటూ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఓ వైపు ప్రభుత్వ విధానలపై ప్రజాగర్ఝన నిర్వహించి.. పాకిస్థాన్ లోని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ముప్పేట దాడి చేస్తున్న ఇమ్రాన్ ఖాన్ మరోవైపు తన వివాహ వార్తల కథనాలతో పార్టీ శ్రేణులను ఉలిక్కి పాటుకు గురిచేశారు.

మీడియా కథనాలు అతిశయోక్తిని తలపిస్తున్నాయని చెప్పాన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన వివాహం గురించి తానేం చెప్పాలని అనుకున్నా.. దానిని తన పార్టీ కార్యకర్తల మధ్య చెబుతానన్నారు. రెండో వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుందని, ఎందుకంటే తమ పిల్లలు కూడా ఇందులో భాగస్వాములవుతారని వారి నిర్ణయం మేరకు నడుచుకోవాల్సి వస్తుందని చెప్పారు. అదీ కాక పెషావర్ లో జరిగిన మారణహోమం గాయాలు తమను వెంటాడుతున్నాయని, ఈ సమయంలో పాకిస్థాన్ వ్యాప్తంగా తామంతా సంతాప ప్రకటించే పనిలో వున్నామన్నారు. ఈ సమయంలో తాము వివాహం చేసుకున్నామన్న వార్త కథనాలు తప్పని చెప్పారు.

 అయితే తాము సరైన సమయం కోసం వేచి చూస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకోచ్చారు. సరైన సమయంలో బిబిసీ మాజీ యాంకర్ రెహమ్ ఖాన్ ను వివాహమాడుతానని చెప్పారు. అయితే వార్త కథనాలపై రెహమ్ ఖాన్ ఘాటుగానే స్పందించారు. రహస్య వివాహం చేసుకున్నట్లు వార్తలు రాయడం సైబర్ నేరమని సూచించారు. పెళ్లి జరగలేదని తోసిపుచ్చింది. పాశ్చాత దేశ పత్రికలు తమ దేశ సంప్రదాయాలను మరచి ఈ తరహా కథనాలను ప్రచురించడం పట్ల ఆమె హెచ్చరించారు. అయితే వివాహ వార్తలపై మాత్రం అమె దాటవేత ధోరణి అవలంభించారు.

లేటువయసులో ఘాటుప్రేమ అంటే ఇదేనేమో. ఇద్దరు పిల్లలు వున్న తరువాత కూడా 62 ఏళ్ల వయస్సులో పెళ్లికి సిద్దం అంటున్న ఇమ్రాన్ ఖాన్.. ముగ్గురు పిల్లల తల్లి అయిన బీబీసీలో పనిచేసిన యాంకరమ్మ 41 ఏళ్ల రెహమ్ ఖాన్. ఇద్దరు చట్టాపట్టాలేసుకుని తిరిగే రోజు ఎప్పడు వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Imran Khan  Reham Khan  marriage  politician  Former BBC anchor  

Other Articles