Amul milk faces problems in telangana

Amul Milk, Amul milk products, Amul latest products, Amul in telangana, Amul milk problems in telangana, vijaya milk, vijaya milk in telangana, telangana milk producrers, dairy farms in telangana, andhra pradesh dairy farms, telangana updates, andhra pradesh latest

Amul Milk, Amul milk products, Amul latest products, Amul in telangana, Amul milk problems in telangana, vijaya milk, vijaya milk in telangana, telangana milk producrers, dairy farms in telangana, andhra pradesh dairy farms, telangana updates, andhra pradesh latest

అమూల్ బేబికి తెలంగాణలో అడ్డంకులు

Posted: 01/03/2015 10:36 AM IST
Amul milk faces problems in telangana

తెలంగాణ లోని డెయిరీ ఫాంలకు కొత్త కష్టాలు వచ్చాయి. ఇప్పటికే రాష్ర్టంలో ఉన్న డెయిరీ ఫాంల మద్య పోటీ ఉండగా వీటికి కొత్త పోటీదారు వస్తోంది. గుజరాత్ లో సంచలనం సృష్టించి దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతి గాంచిన అమూల్ త్వరలో తెలంగాణలో అడుగు పెట్టనుంది. ఈ పాల రాకపై స్థానిక డెయిరీ ఫాంలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.., తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఓ వైపు అమూల్ యాజమాన్యం ఇందుకోసం చకచకా ఏర్పాట్లు చేసుకుంటుండగా మరోవైపు ప్రభుత్వం ఈ సంగతేంటో చూడండి అంటూ అధికారులను ఆదేశిస్తోంది.

గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) నిర్వహిస్తున్న అమూల్ కోసం తెలంగాణలోని నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వ్యక్తులతో ఇప్పటికే ఒప్పందాలు కూడా జరిగాయట. NARMAC గా పిలిచే ఈ జిల్లాల అసోసియేషన్ ఇప్పటివరకు మదర్ డెయిరీకి పాలు ఉత్పత్తి చేసేది. ఇకపై అమూల్ కు కూడా పాల ప్రాసెసింగ్, ప్యాకేజ్, మార్కెటింగ్ చేయించనుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా చేయటం వల్ల స్థానికులకే ఎక్కువ పని లభిస్తుందని వారు కూడా సంతోషపడుతున్నారు.

అయితే గుజరాత్ కు చెందిన అమూల్ తెలంగాణలో పాలు అమ్మడానికి స్థానికంగా కాకుండా.., నేరుగా గుజరాత్ నుంచి కంటెయినర్ల ద్వారా పాలను పంపించటంపైనే అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఇలా చేయటం వల్ల స్థానికుల పొట్టకొట్టినట్లవుతుందని సర్కారు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అటు ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ కూడా అమూల్ రాకపై అభ్యంతరం తెలుపుతోంది. అంతేకాకుండా NARMAC కు కేటాయించిన స్థలం స్థానిక ప్రభుత్వానికి చెందినది కాబట్టి ఆ స్థలంలో పనిచేసే వారు ఇక్కడి ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే వ్యవహరించాలని చెప్తున్నారు. ఈ మొత్తం నివేదిక కోరిన తెలంగాణ ప్రభుత్వం, ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amul milk  vijaya milk  telangana upda+tes  

Other Articles