Working night shifts increases the risk of heart disease and cancer

night shifts risk, night shifts risk of heart attack, night shift risk of lung cancer, Harvard Medical School studies, Dr. Eva Schernhammer, risk of heart attack and lung cancer,

A new study has found that rotating nigh shift work may increase the risks of heart disease and lung cancer.

రాత్రి వేళ్లల్లో పనిచేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి..!

Posted: 01/06/2015 10:04 PM IST
Working night shifts increases the risk of heart disease and cancer

రాత్రిషిప్టుల్లో ఉద్యోగాలను రొటేషన్ పద్థతిలో చేసే వారికి అనారోగ్యాల ముప్పు అధికమని తాజా అధ్యయనం పేర్కొంది. ఇలాంటి షిప్టుల్లో పనిచేసే ఉద్యోగులకు గుండె సంబంధ జబ్బులు, వూపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. రాత్రివేళల్లో పనిచేసే ఉద్యోగుల జీవగడియారం పనితీరు అస్తవ్యస్తంగా మారుతుందనీ...అది క్యాన్సర్‌కు కారణమౌతుందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) 2007లోనే హెచ్చరించింది. అయితే, రాత్రి షిప్టుల్లో రొటేషన్ పద్ధతి అయిదేళ్లు అంతకంటే ఎక్కువ కాలంపాటు పనిచేసే మహిళలకు గుండె సంబంధమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని తాజా అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు తెలిపారు.

15 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు నైట్‌షిప్టులను రొటేషన్‌లో చేసే మహిళలకు వూపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదమూ లేకపోలేదని పేర్కొన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... గుండెఆరోగ్యాన్ని....క్యాన్సర్‌ను తట్టుకునే శక్తిని ఇచ్చే విషయంలో జీవగడియారం, నిద్ర అనేవి కీలకపాత్ర పోషిస్తాయని పరిశోధకులు అన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : night shifts  heart disease  lung cancer'  

Other Articles