Man calls cops to help discipline daughter

florida dad calls cops, Florida Dad Calls Cops for Punishing His Daughter, risking legal backlash father called police, 12 year old fighting with sister, father from Okeechobee calls police, Okeechobee father neol stephen

what happens when parents are fearful of disciplining their own children with the possibility of being reprimanded by the law?

పోలీసులు.. మా పాపకు క్రమశిక్షణ నేర్పరూ.. ప్లీజ్..!

Posted: 01/06/2015 10:09 PM IST
Man calls cops to help discipline daughter

చిన్న పిల్లలు మారాం చేస్తే అదిగో బూచాడు వస్తున్నాడని భయపెట్టి అదుపులో పెట్టుకుంటాం. అదే కాస్త వయస్సు వచ్చిన పిల్లలు అల్లరి చేస్తే.. కళ్లు పెద్దవి చేసి అల్లరి మానాలని మందలిస్తాం. అప్పటికీ  మాట వినకుండా అల్లని చేశారనుకోండి ఏం చేస్తారు. బెదిరిస్తారు.. మీకు ఫలానా కావాలంటే గమ్మనుండమంటాం. అయినా వినకపోతే నాలుగు తగిలిస్తాం.. లేదంటే ఏదో విధంగా అల్లరి మాన్పించడానికి మరోకటేదో తీసుకువస్తాం. కానీ అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు.

తన కూతురు అల్లరి మాన్పించాలంటూ ఏకంగా పోలీసులకు ఫోన్ చేశాడు. క్రమశిక్షణతో మెలిగేలా చూడాలని అభ్యర్థించాడు. 12 ఏళ్ల తన కుమార్తె చెప్పిన మాట వినడడం లేదని, ప్రతి విషయానికి తన సోదరితో గొడవ పడుతోందని పోలీసులకు చెప్పాడు. గతవారం సోదరితో వాగ్వాదానికి దిగిందని వాపోయాడు. అయితే ఈ ఫోన్ కాల్ అందుకున్న పోలీసులు విస్తుపోయారు. అయితే పిల్లలను హింసిస్తే నేరం అని చట్టంలో వుండటంతో.. తాను వారిని వారించలేక.. చివరకు కొట్టనూ లేక.. ఇలా పోలీసులకు ఫోన్ చేసిన పిలిపించాడు ఆ కన్న తండ్రి.

అమెరికాలోని ఫ్లోరిడా ఓకీచోబీ ప్రాంతంలో నివాసముంటున్ననియోల్ స్టీఫెన్ తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. పిల్లలపై చేయి చేసుకుంటే కూడా నేరం అవుతుందన్న ఉద్దేశంతో పోలీసులకు ఫోన్ చేసినట్టు వెల్లడించాడు. తన కుమార్తెను క్రమశిక్షణలో పెట్టాలని కోరాడు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక పోలీసులు తెల్లమొహం వేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daughter  discipline  Florida  US  

Other Articles