President s rule in jammu and kashmir

President's rule in Jammu and Kashmir, Jammu and Kashmir president's rule, Jammu and Kashmir latest updates, BJP on Jammu and Kashmir, PDP on Jammu and Kashmir, Omer abdullah, ncp on Jammu and Kashmir president rule, Jammu and Kashmir political controversy, president's rule in India, Telangana president's rule, president's rule, Jammu and Kashmir updates

President's rule in Jammu and Kashmir : with latest inputs and uncertain political situation Jammu and Kashmir may go into direct rule of central Government. BJP is trying to form government with help of PDP, but the largest party is not showing interest to have friendship with BJP

కాశ్మీర్ లో రాష్ర్టపతి పాలన..! ఎవరికి లాభం ?

Posted: 01/09/2015 03:53 PM IST
President s rule in jammu and kashmir

దేశానికి కిరీటంగా ఉన్న కాశ్మీరంలో రాజకీయ పరిస్థితులు కలవర పెడుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవటంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం వీడటం లేదు. ఇప్పటివరకు వేర్పాటువాదం,  ఉగ్రవాదంతో హిమప్రాంతంలో గందరగోళం నెలకొనగా.., తాజాగా ప్రభుత్వ ఏర్పాటు సమస్యగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవటంతో రాష్ర్టపతి పాలన దిశగా అడుగులు వేస్తోంది. గవర్నర్ నివేదిక ప్రకారం రాష్ర్టపతి పాలనకు సిఫార్సు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఈమద్య 87 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 44 సీట్లను ఏ పార్టీ గెలుచుకోలేదు. 28 స్థానాలతో పీడీపీ అతి పెద్ద పార్టీగా నిలవగా.., 25 స్థానాలతో బీజేపి రెండవ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కు ఆశ్చర్యకరంగా 12 స్థానాలు వచ్చాయి. అటు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 15 సీట్లు వచ్చాయి. ఎన్నికల్లో ఓటమి పాలు కావటంతో ముఖ్యమంత్రి పదవికి ఒమర్ అబ్దుల్లా రాజీనామా చేశాడు. అయితే ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరటంతో అందుకు సమ్మతించాడు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపి సిద్ధంగా ఉన్నా.., పీడీపీ ముందుకు రావటం లేదు.

జమ్మూ ప్రజలు కోరుకుందేమిటి...?


వేర్పాటువాదం, ఉగ్రవాద సమస్యలతో సతమతం అవుతున్న కాశ్మీర్ లో ఈ సారి ప్రజలు చైతన్యవంతులయ్యారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. ప్రధానంగా ఉండే మతవాదంతో పాటు, ప్రాంతీయ వాద అంశాలపై ఈ దఫా పోలింగ్ ప్రభావం చూపింది. మతవాదాన్ని మద్దతుపర్చే వ్యక్తులు ఒక పార్టీకి ఓటేయగా.., ప్రాంతీయవాదం కోరుకునే వారు మరో పార్టీని ఎంచుకున్నారు. ఇలా ప్రజలు రెండుగా విడిపోయి ఓట్లేయటంతో రెండు రకాల ఫలితాలు వచ్చాయని స్పష్టం అవుతోంది. అంతేకాదు ఈ ఫలితాలు ఎన్సీపీపై ఉన్న వ్యతిరేకతను, కాంగ్రెస్ చేసిన మోసాలకు ప్రజలు ఏవిధంగా బుద్ది చెప్పారో కూడా చూపించాయి. అంతేకాకుండా ఈ ఫలితాలు కాశ్మీర్ అభివృద్ధిని, మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

భిన్న ఫలితాలు రావటంతో.., రెండు వేర్వేరు సిద్దాంతాలున్న పార్టీలు ఒకటిగా కలవలేకపోతున్నాయి. ఒకవేళ కలిసినా అది కొద్దికాలమే నిలుస్తుంది. పీడీపీ పార్టీ ప్రజల కంటే రాజకీయ ప్రయోజనాలు, సిద్ధాంతాల గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. దీంతో సమస్య ముడి వీడటం లేదు. ఫలితంగా హిమ లోయ ప్రజలు కోరుకున్న అభివృధ్ధి అందని ద్రాక్షగా మిగలనుంది. రాష్రపతి పాలన విధిస్తే నియంత్రణ కేంద్రం చేతిలోకి వెళ్ళనుంది.

రాష్ర్టపతి పాలనతో ఎవరికి లాభం ?

కాశ్మీర్ లో రాష్ర్టపతి పాలన వస్తే ఇది అన్ని విధాలా బీజేపికే కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ర్టపతి పాలన కొనసాగితే కేంద్రం నియంత్రణ ఉంటుంది. ఫలితంగా మోడి సర్కారు రాష్ర్టంపై నియంత్రణాధికారాలు కలిగి ఉంటుందన్నమాట. కాశ్మీర్ లో పట్టుకోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తాజా ఎన్నికల్లోనే స్పష్టం అయింది. అప్పట్లో ఏకంగా మోడియే రంగంలోకి దిగారు. ఆర్నెల్ల రాష్ర్టపతి పాలన తర్వాత వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడి సర్కారు కాశ్మీర్ పై మరింత ఫోకస్ పెంచే అవకాశం ఉంది. ఎన్నికలకు వెళ్ళినపుడు ఇది వారికి ప్రచారాస్ర్తంగా ఉపయోగపడనుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నా కూడా పీడీపీ సహకరించకుండా ఇబ్బందులు పెట్టిందని ప్రజల ముందు దోషిని చేసేందుకు అవకాశం ఉంటుంది.

అలా కాకుండా ప్రభుత్వం ఏర్పడినా కూడా బీజేపికే లాభం కలుగుతుంది. మిగతా రాష్ర్టాల మాదిరిగా కాశ్మీర్ అంశాల్లో కేంద్రం అన్ని వేళలా జోక్యం చేసుకోలేదు. కాబట్టి.., రాష్ర్టం స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకున్నా అందుకు ప్రభుత్వంలో ఉండే బీజేపి మద్దతు తప్పనిసరి అవుతుంది. కమలదళం అంగీకరించకుంటే నిర్ణయాలు అమలు జరగవు. ఈ విషయంలో కేంద్రం కాశ్మీర్ బీజేపి నేతలను ఉపయోగించుకుని పావులు కదిపి పనులు చేసుకోనుంది. కాబట్టి రాష్ర్టపతి పాలన వచ్చినా.., ప్రభుత్వం ఏర్పడినా బీజేపికే లాభం కలుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu and Kashmir  president's rule  BJP  

Other Articles