Minor fire in karnataka cm siddaramaiah s chopper just before take off

Karnataka chief minister Siddaramaiah, Siddaramaiah escaped from minor fire accident, fire accident at Bengaluru's HAL airport, Minor Fire in Sidda ramaiah's chopper, Minor Fire in Sidda ramaiah's chopper Just Before Take Off, karnataka cm siddaramaiah, sidda ramaiah chopper, siddaramaiah helicopter, fire in siddaramaiah chopper,sidda ramaiah fly from bengaluru to mysore, siddaramaiah helicopter developed a snag,

Karnataka chief minister Siddaramaiah escaped from minor fire accident at Bengaluru's HAL airport today as his helicopter meant to carry to Mysore developed a snag.

సిద్దరామయ్యకు తృటితో తప్పిన పెను ప్రమాదం..

Posted: 01/10/2015 03:16 PM IST
Minor fire in karnataka cm siddaramaiah s chopper just before take off

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఓ పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ పైలట్ అప్రమత్తంగా ఉండటంతో సిద్దరామయ్యను పెను ప్రమాదం నుంచి తప్పించారు. వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ మధ్యాహ్నం కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజధాని బెంగుళూరు నుంచి మైసూరుకు బయలుదేరాల్సి వుంది. దీంతో ఆయన  హెలికాప్టర్‌లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. హెలికాప్టర్‌లో కూర్చోగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

మంటల్ని గుర్తించిన పైలట్, భద్రతాధికారులు హుటాహుటిన సిఎం సిద్ధరామయ్యను కిందకు దించేశారు. పైలట్ అప్రమత్తంగా ఉండటం వల్ల పెను ప్రమదం తప్పిందని అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఇటీవలే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రయాణిస్తున్న విమానం కూడా ఇలాగే సాంకేతిక కారణాలతో మొరయించడంతో అప్రమత్తంగా వున్న ఫైలెట్ హుటాహుటిన కిందకు దించిన విషయం తెలిసిందే.

కాగా, ప్రభుత్వాధినేతలు, కేంద్ర మంత్రులు ఉపయోగించే హెలికాప్టర్లకు ఇలాంటి ప్రమాదాలు జరగడం ఆందోళన చెందాల్సిన విషయమే. ఇప్పటికే హెలికాప్టర్ ప్రమాదాల కారణంగా ఇద్దరు ముఖ్యమంత్రులను భారత్ పోగొట్టుకున్న తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం వీటిపై దృష్టిసారించడం లేదు. సమైఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహా దోర్జిఖండులను దేశం హెలికాప్టర్ ప్రమాదాలలో పొగోట్టుకుంది. ఇప్పటికైనా ఈ ప్రమాదాలను నివారించడంపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka  CM  siddaramaiah  helicopter  accident  

Other Articles