Kejriwal challenges modi in delhi elections

kejriwal challenges pm modi, kejriwal demands full statehood, kejriwal demands delhi full statehood, Aam Aadmi Party, Arvind Kejriwal, Delhi former CM Arvind kejriwal, Congress, Delhi Assembly Election 2015, Delhi Development Authority, BJP leader Harsh Vardhan, Delhi former CM Sheila Dikshit, kejriwal demands modi to keep the promise, kejriwal demands bjp to fulfill the promise, union minister sadhvi, venkaiah naidu, pm narendra modi, smruthi irani

Kejriwal's challenge to Modi catches BJP on the wrong foot ... to bring in the promise of granting full statehood to Delhi during the 2014 general elections.

ప్రధాని నరేంద్ర మోడీకి అర్వింద్ ‘కేజ్రీ సవాల్’..

Posted: 01/10/2015 04:09 PM IST
Kejriwal challenges modi in delhi elections

త్వరలో జరగనున్న దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలలో భాగంగా రెండు ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైనా విమర్శలు, ప్రతివిమర్శల యుద్దం సాగుతోంది. ప్రధాన మంత్రి ఎంచుకున్న సోషల్ మీడియానే యుద్దానికి వేదికగా మారింది. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విసురుత్తన్న విమర్శలను కేంద్రంలోని అధికార బీజేపి పార్టీ సమర్థవంతంగానే తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వేసిన ప్రశ్నతో బీజేపి నోట్లో పచ్చి వెలగకాయ పడినట్లైంది.

అరవింద్ కేజ్రీవాల్ ప్రదాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. దమ్ముంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని బీజేపి ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఆప్ అన్ని విమర్శలను సమర్థవంతంగానే తిప్పికొట్టిన బీజేపి.. ఈ సవాల్ పై స్పందించడం లేదు. ఈ ప్రశ్న తమను అడగలేదన్నట్లుగా తప్పించుకోజూస్తుంది.

ట్విట్టర్ సాక్షిగా అరవింద్ కేజ్రీవాల్ సవాల్ ఇలా వుంది. రేపు మరోమారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు వస్తారు. గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హక్కును కల్పిస్తామన్నారు. అయితే ఇదే విషయాన్ని రేపు కూడా ప్రదాని చెబుతారా..? లేక ఈ అంశంపై కూడా వెనక్కుతగ్గి యు టర్న్ తీసుకుంటారా అని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన ఇవాళో, రేపో అన్నట్లు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలకు మరింత ఉత్సాహం కల్పించేందుకు ప్రధాని మోదీ రామ్లీలా మైదాన్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి బీజేపీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు అమిత్ షా కూడా హాజరు కానున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  kejriwal  delhi elections  AAP  BJP  

Other Articles