దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. రెండేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన తలపించే మరో అకృత్యం చోటు చేసుకుంది. సుమారు 30 ఏళ్ల మహిళపై మగమృగాళ్లు పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు. కాళ్లు, చేతులు కట్టివేసి ఉన్న ఆమె మృతదేహం ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో బయటపడింది. మృతురాలిపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేసి ఉంటారని తెలుస్తోందని పోలీసులు తెలిపారు.
బాధితురాలిపై కక్ష పెట్టుకున్నవారే ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. బాధితురాలిపై అత్యంత పైశాచికంగా లైంగికదాడికి పాల్పడి, ఆమె రహస్య భాగాల్లోకి వస్తువులను చొప్పించారు. ఆమె కాళ్లు, చేతులు కట్టివేయడంతో పాటు, మెడ చుట్టూ వస్త్రంతో చుట్టి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు లభించాయని, దీని వెనుక బాధితురాలి స్నేహితులు ఇద్దరు ముగ్గురు ఉండి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
అయితే వారి వివరాలు వెల్లడించడానికి మాత్రం నిరాకరించారు. దక్షిణ దిల్లీలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఓ వర్క్‌షాపులో టైలర్‌గా పనిచేస్తుంది. ఆమె భర్త గతంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతోబాధిత మహిళే ఆ ఇంటిని పోషిస్తోంది. శుక్రవారం విధుల్లోకి వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం వసంత్ కుంజ్ ప్రాంతంలోని పొదల్లో ఉండగా కాపలా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more