Islamic state cyber attack on us

Islamic State, Islamic State terrorists, IS attack on centcom twitter, IS Attack on Centcom youtube page, US Central Command, isis attacks, isis abbrevation, world latest, terrorist attacks in world

Islamic State cyber attack on US : world cruel islamic terrorist organization ISIS starts cyber attack on USA. ISIS sympathisers launch cyber attack on central command's twitter and youtube pages

అమెరికాకు ఇస్లామిక్ స్టేట్ భయం

Posted: 01/13/2015 10:57 AM IST
Islamic state cyber attack on us

అగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికాకు ఇస్లామిక్ స్టేట్ భయం పట్టుకుంది. ప్రపంచానికి పెను సవాల్ గా మారిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇప్పుడు అమెరికాను టార్గెట్ చేసుకున్నారు. శ్వేతసౌధ దాడులకు నిరసనగా.., ఆ దేశ పౌరులను హత్య చేసిన ఐ.ఎస్.ఐ.ఎస్ ఇప్పుడు నేరుగా దాడులకు దిగుతోంది. సైబర్ కాలిపేట్ పేరుతో అమెరికాలోని శక్తివంతమైన సెంట్రల్ కమాండ్ కు చెందిన ట్విట్టర్, యూ ట్యూబ్ పేజీలను హ్యాక్ చేశారు. ‘అమెరికా సైనికులారా.., మేం వస్తున్నాం. ఓ సారి వెనక్కి తిరిగి చూసుకొండి’ అని పోస్ట్ చేశారు.

త్వరలో దాడులు తప్పవని ఈ పోస్ట్ తో హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ‘ఐ లవ్ యు ఐ.ఎస్.ఐ.ఎస్’ అనే బ్యానర్ ను సెంట్రల్ కమాండ్ ట్విట్టర్ పేజీపై పోస్ట్ చేశారు. ‘సైబర్ కాలిఫేట్ ఇప్పటికే వచ్చేశాడు. ఇక దాడులు తప్పవు’ అని పోస్ట్ చేశారు. హ్యాకింగ్ విషయం తెలుసుకున్న సాంకేతిక నిపుణులు వెంటనే పేజిని ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడినుంచి హ్యాకింగ్ అయిందన్న విషయంపై విచారణ జరుపుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన వ్యవస్థ. కట్టుదిట్టమైన భద్రత, సాంకేతిక పరిజ్ఞానం ఉండే ఈ వ్యవస్థపైనే హ్యాకింగ్ కు పాల్పడ్డారంటే వారి సత్తా ఏమిటో స్పష్టం అవుతోంది.

హ్యాకింగ్ విషయాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఆన్ లైన్ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. ఆన్ లైన్ భద్రతపై మరోసారి సమీక్ష జరుపుతామన్నారు. గతంలో కూడా పలు తీవ్రవాద సంస్థలు సోషల్ మీడియా పేజీలను హ్యాక్ చేసి పోస్టులు చేసిన విషయం తెలిసిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Islamic State  USA  Cyber Attacks  

Other Articles