Pakistan not start dialogue with india of kashmir not in agenda

Pakistan on India, Pakistan India problems, Pakistan India relationship, Pakistan vs India, Pakistan on Kashmir, India on Paksitan, Usa on pakistan, pakistan terrorists, India development, Usa India relations, world latest updates

Pakistan not start dialogue with India of Kashmir not in agenda : Pakistan stated that it will not start talks with India if Kashmir issue not involved in agenda. pakistan says Kashmir is the main problem with India. Usa hopes India Pakistan will become friends and both

చిత్తశుధ్ధి ఉంటే ఇలా చెప్పరు..!

Posted: 01/13/2015 02:26 PM IST
Pakistan not start dialogue with india of kashmir not in agenda

భారత్ తో మైత్రి కోరుకుంటున్నట్లు చెప్పుకునే పాకిస్థాన్ అసలు స్వరూపం బయట పెట్టింది. భారత్-పాక్ మద్య విభేదాలు తొలగించుకునేందుకు రెండు దేశాలు కృషి చేయాలన్న అమెరికా విజ్ఞప్తిపై స్పందించింది. విభేదాలు పరిష్కరించుకునేందుకు తమకే అభ్యంతరాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఎజెండాలో కాశ్మీర్ అంశం లేకపోతే తాము చర్చలను మొదలు పెట్టమని స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ చెప్పినా.., ఇంకెవరు కోరినా తమ వైఖరి మారదని పాక్ జాతీయ భద్రతా సలహా దారు సత్రజ్ అజీజ్ ప్రకటించారు.

అంతేకాకుండా భారత బలగాలు తరుచుగా సరిహద్దు వెంబడి కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని చెప్పారు. ఈ మాటల పట్ల భారత్ వైపు నుంచి ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే సరిహద్దులో ఎవరు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడేది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు. చీకటి దాడులకు అలవాటు పడిన పాకిస్థాన్ గత రాత్రి కూడా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. అలాంటి దేశం భారత్ పై ఆరోపణలు చేయటం చూస్తేనే.., సమస్య పరిష్కారంపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం అవుతుంది.

కాశ్మీర్ సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని మోడి ఎప్పటినుంచో చెప్తున్నాడు. అలాంటప్పుడు కాశ్మీర్ ఎజెండాలో అంశంగా ఉండాలని మళ్లీ చెప్పటంలో ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలి. భారత్-పాక్ దేశాల మద్య సన్నిహిత సంబంధాలు నెలకొనాలని అమెరికా అద్యక్షుడు జాన్ కెర్రీ ఆకాంక్షించారు. ఇటీవల సరిహద్దులో జరుగుతున్న పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేశారు. విభేదాలు పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు ముందుకు రావాలన్నారు. అటు ఉగ్రవాదంపై పోరులో పాక్ కు అమెరికా ఎప్పుడూ సహకారం అందిస్తుందని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan vs India  Kashmir  Usa on Pakistan  

Other Articles