Trs party got approval from election commission as regional party in andhra pradesh state

trs party, trs party news, trs party ministers, cm kcr news, andhra pradesh state news, cm chandrababu naidu news, kcr latest news, chandrababu naidu news, trs party andhra pradesh, andhra pradesh regional parties, telangana regional parties

trs party got approval from election commission as regional party in andhra pradesh state

ఆంధ్రరాష్ట్రంలోనూ టీఆర్ఎస్ పార్టీ హవా...

Posted: 01/15/2015 11:01 AM IST
Trs party got approval from election commission as regional party in andhra pradesh state

చదవడానికి ఆశ్చర్యంగానే వున్న... ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఇది నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఇకనుంచి ఆంధ్రప్రదేశ్’లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగనుందని తాజా సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా జాబితాలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్’లో ప్రాంతీయ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది.

దేశంలో మొత్తం 1807 రాజకీయ పార్టీలు వుండగా.. అందులో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు జాతీయ రాజకీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. మరో 64 పార్టీలు రాష్ట్రస్థాయి పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఇందులో భాగంగానే ఆంధ్రరాష్ట్రంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతోబాటు టీఆర్ఎస్’కు రాష్ట్రస్థాయి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతోబాటు ఎంఐఎంకు రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తింపు లభించింది.

ఏదేమైనా.. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రాలో గుర్తింపు లభించడంపై అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొని నిబంధనల మేరకు ఓట్లను తెచ్చుకోవడంలో విజయం సాధించడం వల్లే టీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు లభించినట్లు తెలుస్తోంది. దీంతో తమ పార్టీకి ఆంధ్రాలో గుర్తింపు దక్కడంతో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles