An asteroid will travel near the earth nasa research center

nasa research center, asteroid news, nasa asteroid news, asteroid the earth news, nasa scientists

an asteroid will travel near the earth nasa research center : according to the nasa research center.. an asteroid will travel near the earth at january 26.

భూమికి దగ్గరలో భారీ గ్రహశకలం.. అంతానికి చిహ్నమా?

Posted: 01/15/2015 11:49 AM IST
An asteroid will travel near the earth nasa research center

భూమికి అతి దగ్గరలోనే ఓ భారీ గ్రహశకలం పయనించనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పష్టం చేసింది. దీనికి 2004 బీఎల్ 86 అని పేరు పెట్టినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే.. దీంతో అంతగా ప్రమాదం ఏమీ వుండకపోవచ్చునని వారు పేర్కొంటోంది. ఎందుకంటే.. ఇది కేవలం అర కిలోమీటర్ వ్యాసంతో మాత్రమే వుందని, పైగా ఇది భూమికి-చంద్రునికి మధ్య దూరానికి ఇంకా మూడు రెట్ల దూరంగా పయనించనుందని అంటోంది.

ఈ గ్రహశకలం పయనించే విధానాన్ని ప్రజలు స్పష్టంగా వీక్షించవచ్చునని ఆ సంస్థ తెలిపింది. భూమికి చాలా దగ్గరలోనే పయనించే ఈ శకలం ధూళి ప్రభావం కూడా భూమిపై ఏమీ వుండదని నాసా స్పష్టం చేసింది. 1999లో కూడా ఏఎన్ 10 అనే ఓ శకలం భూమికి ఇంతే దూరం నుంచి దూసుకుపోయిందని వివరించిన నాసా.. ఇప్పుడొచ్చే ఈ శకలం ద్వారా కూడా ఎటువంటి నష్టం జరగదని తెలిపింది. ఈ భారీ గ్రహశకలం ఈనెల 26వ తేదీని భూమికి అత్యంత సమీపానికి రానుంది.

ఇదిలావుండగా.. కేవలం 20 సంవత్సరాల వ్యత్యాసంలోనే రెండు గ్రహశకలాలు భూమికి దగ్గరగా పయనించడంపై కొంతమంది శాస్త్రజ్ఞులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూగ్రహం అంతమవ్వడానికి సమయం చాలా దగ్గరపడిందని.. అందుకే ఒకదాని తర్వాత మరొకటి శకలాలు భూమిదిశగా అతి చేరువలోనే పయనిస్తున్నాయని అంటున్నారు. గతంలో శతాబ్దాల కాల వ్యవధిలో శకలాలు పయనించేవని.. కానీ ఇప్పుడు దశాబ్దాల కాలంలోనే పయనించడం చూస్తుంటే మరిన్ని శకలాలు భూమివైపుగా వచ్చే అవకాశాలున్నాయని.. అప్పుడు అవి భూమిని తాకి విధ్వంసం సృష్టించవచ్చునని చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nasa research center  asteroid news  nasa asteroid news  asteroid the earth news  

Other Articles