Rss party leaders announced kiran bedi cm candidate in delhi elections

rss party news, kiran bedi news, kiran bedi bjp cm candidate, aravind kejriwal news, kiran bedi aravind kejriwal, delhi elections, bjp party news

rss party leaders announced kiran bedi cm candidate in delhi elections : rss party leaders finally announced that kiran bedi will take part in delhi elections as cm candidate against to aravind kejriwal

సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీ ఫిక్స్.. భగ్గుమంటున్న భాజపా!

Posted: 01/18/2015 11:45 AM IST
Rss party leaders announced kiran bedi cm candidate in delhi elections

ఇటీవలే మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ భాజపా జాతీయ అధ్యక్షుడు సమక్షంలో బీజేపీ పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే! అప్పటినుంచే ఆమె సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశాలు దాదాపుగా పూర్తయినట్లేనని అందరూ అనుకున్నారు కానీ.. పార్టీ మాత్రం అధికారికంగా ఇంతవరకు వెల్లడించలేదు. ఆమె పార్టీలో చేరిన రోజే.. పార్టీ కోరితే ఆప్ అధినేత కేజ్రీవాల్’పై పోటీకి సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. అయితే.. పార్టీ మాత్రం దానిపై తమ ప్రకటనను వెలువడించలేదు.

ఇప్పుడు తాజాగా ఆర్ఎస్ఎస్ అధికారులు కిరణ్ బేడీయే బీజేపీ సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ అధికారికంగా స్పష్టం చేశారు. అంటే.. ఢిల్లీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కిరణ్ బేడీకి, కేజ్రీవాల్’కి మధ్య గట్టి పోటీ ఏర్పడడం ఖాయమన్నమాట! ఇంతవరకు బాగానే వుంది కానీ.. కిరణ్ బేడీని ఇలా సీఎం అభ్యర్థిగా ప్రకటించడాన్ని భాజపా పార్టీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. సీనియర్ నాయకులను పక్కనపెట్టేసి, అసలు రాజకీయ పరిజ్ఞానం లేని ఓ మాజీ ఐపీఎస్ అధికారిణిని సీఎం అభ్యర్థిగా ఎలా నిలబెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంతర్గత వర్గాల నుంచి సమాచారాలు అందుతున్నాయి.

ఇదిలావుండగా.. నిన్నమొన్నటివరకు ఒకే గూటిలో వున్న రెండు పక్షులు (కేజ్రీవాల్, కిరణ్ బేడీ).. ఇప్పుడు విడివిడిగా ఎన్నికల బరిలో దిగడంతో ఢిల్లీలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఓవైపు జనాలు చాలావరకు కేజ్రీవాల్’కు మద్దతు పలుకుతుండగా.. మోడీ పలుకుబడితో ఎన్నికలు గెలిచే అవకాశం వుందని కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి.. చివరగా ఫలితాలు ఎలా వెలువడుతాయో ఎలక్షన్ల వరకు వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles