Pune mc donalds misbehave with street boy cm fadnavis take action

pune mc donalds news, maharashtra cm fadnavis, pune mc donalds misbehave, internet sources, mc donalds crime news, mc donalds orders

pune mc donalds misbehave with street boy cm fadnavis take action

మెక్ డొనాల్డ్స్ చేసిన సిగ్గుమాలిన చర్యకు ‘సీఎం’ దిగొచ్చారు..

Posted: 01/18/2015 01:21 PM IST
Pune mc donalds misbehave with street boy cm fadnavis take action

మెక్ డొనాల్డ్స్.. ఈ పేరు ప్రపంచంలో ప్రఖ్యాతి చెందింది! ఇటువంటి సంస్థ తాజాగా ఓ సిగ్గుమాలిన చర్యకు పాల్పడి విమర్శలకు గురవుతోంది. ఇది చేసిన ఘనకార్యానికి దీనిపై ఇంటర్నెట్ మాధ్యమంగా నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఏకవంగా దేశవ్యాప్తంగా వున్న ప్రేక్షకుల నుంచి ప్రముఖుల దాకా దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు జరిగిన విషయం ఏమిటంటే.. ఓ యువతి ఆహారపదార్థాలను కొనుగోలు చేసేందుకు తమ స్నేహితులతో కలిసి పుణే మెక్ డొనాల్డ్స్’కు వెళ్లింది. అక్కడ వెళ్లిన అనంతరం ఆ షాపుకు బయటే వున్న అడుక్కుంటున్న బాలుడిని గమనించింది. అతడు ఎంతో ఆకలిగాను, దాహంతోనే వున్నాడు. దీంతో అతడిని చూసి చలించిపోయిన సదరు అమ్మాయి.. ఆ వీధి బాలుడికి ఫాంటా కొనివ్వాలని భావించి లోపలకు తీసుకెళ్లి క్యూలో నిల్చోబెట్టింది. రెండుమూడు నిముషాలు గడిచిన అనంతరం మెక్ డొనాల్డ్స్ స్టాఫ్ వచ్చి ఆ బాలుడిని బయటకు లాగేశారు. ఆ అబ్బాయి తనతో వచ్చాడని యువతి ఎంతగా చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు.

వారు పాల్పడిన ఈ సిగ్గుమాలిన చర్యకు తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి ఫ్రెండ్స్.. అక్కడ జరిగిన మొత్తం తతంగాన్ని వీడియోకెక్కించారు. వెంటనే ఆ వీడియోను ఫేస్’బుక్’లో పెట్టేశారు. అంతే! దీనిని వీక్షించిన ప్రతిఒక్కరు ఈ ఘటనపై మెక్ డొనాల్డ్స్’పై వ్యతిరేకంగా గళం ఎత్తడం ప్రారంభించారు. దీనిపై ఎంతగా విరుచుకుపడ్డారంటే.. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సైతం దిగిరావాల్సి వచ్చింది. ఆయన దీనిపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు మెక్ డొనాల్డ్స్ యాజమాన్యం సైతం పుణే అవుట్ లేట్ నిర్వాహకులపై అంతర్గత విచారణకు ఆదేశించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pune mc donalds  maharashtra cm fadnavis  

Other Articles