Ab de villiers creates sensational century in few balls

ab de villiers news, ab de villiers century, ab de villiers batting news, ab de villiers century news, south africa vs west indies

ab de villiers creates sensational century in few balls

ఫాస్టెస్ట్ సెంచరీతో వరల్డ్ రికార్డ్ బద్దలుకొట్టిన సఫారీ ఆటగాడు..

Posted: 01/18/2015 06:26 PM IST
Ab de villiers creates sensational century in few balls

ప్రపంచక్రికెట్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డులు ఈసారి బద్దలవుతున్నాయి. ఒకరు అత్యధిక స్కోరుతో సంచలనం సృష్టిస్తే.. మరికొందరు తక్కువ బంతుల్లో భారీ స్కోర్లను నమోదు చేసుకుని చెరగని రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. తాజాగా సఫారీ ఆటగాడు కళ్లు చెదిరేలా బంతిని మైదానం బయటకు పంపిస్తూ.. అద్భుతమైన సెంచరీని తక్కువ బంతుల్లోనే నమోదు చేసి ప్రపంచ రికార్డునే బద్దలు కొట్టేశాడు.

దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్.. వెస్టిండీస్’తో జరిగిన మ్యాచ్’లో కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. వన్డే చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఇదివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరే అండర్సన్ పేరిట వుండేది. అండర్సన్ కేవలం 36 బంతుల్లో సెంచరీ చేసి అప్పట్లో రికార్డు సృష్టించాడు. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. అప్పుడు కూడా ప్రత్యర్థి జట్టు విండీసే! ఇప్పుడు తాజాగా డివిల్లీర్స్ అదే జట్టుపై అండర్సన్ కంటే 5 బంతులు తక్కువ ఆడి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇతడు ప్రదర్శించిన ఆటకు జోహాన్నెస్ బర్గ్’లోని న్యూ వాండరర్స్ స్టేడియం బౌండరీల వెల్లవతో తడిసిముద్దయింది.

పిచ్ బ్యాటింగ్’కు అనుకూలిస్తుందని, ఇలాంటి పిచ్’పై లక్ష్యఛేదన సులువని భావించిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ టాస్ గెలిచి దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించాడు. దీంతో రంగంలోకి దిగిన సఫారీ ఆటగాళ్లు తమ విధ్వంసక విన్యాసాలతో కరేబియన్లను చెమటలు పుట్టించేశారు. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (153 నాటౌట్), రూసో (128) స్కోరులతో భారీ భాగస్వామ్యాన్ని జోడించిన తర్వాత రూసో ఔట్ అయ్యాడు. అప్పుడు బరిలోకి వచ్చిన డివిల్లీర్స్.. తన విశ్వరూపం చూపించాడు. 31 బంతుల్లోనే 100 చేసిన ఇతగాడు.. మొత్తం 44 బంతుల్లో 9 ఫోర్లు, 16 సిక్సులతో 149 పరుగులు చేశాడు. ఓపెనర్లు భారీ సెంచరీలు చేసినా.. డివిల్లీర్స్ స్కోరు ముందు అవి వెలవెలబోయాయి. దీంతో ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 439 పరుగులు జోడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ab de villiers century  south africa vs west indies  

Other Articles