Arun jaitley controversial comments media

arun jaitley latest news, arun jaitley controversial comments, arun jaitley media comments, media procedure, indian media, media personalities

arun jaitley controversial comments media : central broadcasting minister arun jaitley said that nowadays media showing only controversial news for their trp ratings.

‘మీడియా ధోరణి’పై నిశిత విమర్శలు చేసిన కేంద్రమంత్రి జైట్లీ...

Posted: 01/18/2015 06:41 PM IST
Arun jaitley controversial comments media

కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న అరుణ్ జైట్లీ మీడియా ధోరణునలపై నిశిత విమర్శలు గుప్పించారు. మీడియా మంచికంటే చెడుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని.. విధ్వంసాలను కెమెరా ఎక్కువగా ఇష్టపడుతోందని ఆయన అన్నారు. ముఖ్యంగా వివాదాల కవరేజీకే మీడియావాళ్లు పెద్దపీట వేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న జైట్లీ మాట్లాడుతూ.. కేవలం విధ్వంసాలను చూపించేందుకు కెమెరా ఎక్కువగా ఇష్టపడుతోందన్నారు. ప్రస్తుతకాలంలో మంచికంటే చెడకే ఎక్కువగా ప్రాచుర్యం లభిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనుషుల కష్టాలు ఇప్పుడు వార్తలు రూపుదిద్దుకోవడం లేదని.. క్రైమ్, ప్రకృతి విపత్తులను ప్రధాన వార్తలుగా మీడియావాళ్లు పరిగణిస్తున్నారని ఆయన అన్నారు. మునుపటికంటే ఇప్పుడున్న మీడియా ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని ఆయన అన్నారు. కేవలం టీఆర్పీ కోసం సంచలన వార్తల వెంటపడుతున్నారని ఆయన వివరంచారు.

ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక విప్లవం మాత్రమే ఎక్కువగా నడుస్తోందని అన్న జైట్లీ.. ప్రజలు ఐప్యాడ్’లు, ట్యాబ్’ల సహాయంతోనే రాత్రిసమయంలో పత్రికలు చదువుతున్నారని అన్నారు. నేటి సమాజంలో మీడియా పాత్ర మరింతగా పెరిగిందని.. అటువంటి మీడియా కేవలం తమ టీఆర్పీ రేటింగుల కోసమే వివాదాస్పద వార్తలను చూపించడం మానేసి.. ఒక వార్తను వార్తగానే చూపిస్తూ నలుగురికి సందేశాన్ని అందివ్వడంలో ఎంతో ఉన్నతి వుంటుందని తన భావనను వ్యక్తం చేశారు. అయితే.. మీడియా స్వేచ్ఛకు ఎన్డీయే సర్కారు కట్టుబడి వుంటుందని పేర్కొన్న ఆయన.. పలు మార్పులు చేసుకుంటే మంచిదనే ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arun jaitley news  arun jaitley media comments  

Other Articles