Dinesh trivedi likely to join bjp soon

dinesh trivedi to join bjp soon, another set back to mamata, dinesh trivedi and 4 others join bjp, former uniion minister dinesh trivedi, Dinesh Trivedi, Mamata Banerjee, Bharatiya Janata Party, Trinamool Congress, West Bengal,

In what may come as a huge setback for Mamata Banerjee, Trinamool Congress (TMC) leader Dinesh Trivedi is likely to join Bharatiya Janata Party (BJP), reports said on Tuesday.

అయ్యయో మమత.. ఇలా అయితే ఎలా..?

Posted: 01/20/2015 07:26 PM IST
Dinesh trivedi likely to join bjp soon

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్ లో ఆపరేషన్ ఆకర్ష్ తో ముందుకు వెళ్తున్న బీజేపి, మమతకు అపర విధేయులనుకున్న సీనియర్ నాయకుల భుజాలపై బీజేపి కండువా కప్పేందుకు కూడా రెడీ అయ్యింది. ఒకొక్కరుగా పార్టీ ముఖ్యనేతలు, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించిన నేతలు కూడా మమతకు దూరం అవుతున్నారు.  మమత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మంజుల్ కృష్ణ ఠాకూర్ నుంచి ప్రారంభమైన వలసల పర్వంలో మరి కొందరు చేరనున్నట్లు సమాచారం..

బీజేపీలో చేరారురైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టి.. అందులో అంశాలపై మమత ఆగ్రహానికి గురై అదేరోజు తన పదవికి రాజీనామా చేసిన రైల్వేశాఖ మాజీమంత్రి దినేష్ త్రివేది సహా నలుగురు మాజీ మంత్రులు కాషాయ జెండాలు కప్పుకోనున్నారు. 16 సంవత్సరాల పాటు తృణమూల్ కాంగ్రెస్లో అగ్ర నాయకుడిగా వెలుగొందిన త్రివేదీ.. ఇప్పుడు ప్లేటు మార్చారు. నరేంద్రమోదీ అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడని ప్రస్తుతించారు. అంతేకాదు, మమతా బెనర్జీ పేరు ప్రస్తావిస్తూ.. రాజకీయాల్లో ఇగోను వదిలేయాలని, ఆత్మగౌరవం ఉండాలని, అంతేతప్ప పొగరు ఉండకూడదని చెప్పారు. అదేసమయంలో మమత వ్యక్తిగతంగా చాలా మంచివారన్నారు. బెంగాల్ రాజకీయాల్లో మాఫియా ప్రమేయం పెరిగిపోయిందని దినేష్ త్రివేది ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పశ్చిమ బెంగాల్ లోని అన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో బీజేపి బలంపేతం చేస్తుండగా, మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ మాత్రం డీలా పడింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dinesh trivedi  tmc leader  ex-railway minister  

Other Articles