Us woman leaves million dollar fortune to pet dog

American woman leaves million-dollar fortune to pet dog, US woman leaves million-dollar fortune to pet dog, US woman, million-dollar fortune to pet, trust fund to pet dog, vacation home to pet dog,Rose Ann Bolasny, New York women million-dollar fortune to pet dog, pet Maltese terrier named Bella Mia, Port St Lucie,

A 60-year-old woman in the US has willed a million-dollar fortune consisting of jewellery, a trust fund and vacation home to her pet dog. Rose Ann Bolasny from New York has decided to leave her valuables to her pet Maltese terrier named Bella Mia.

శునకంపై మమకారం చూసిన సంపన్నురాలు

Posted: 01/20/2015 08:53 PM IST
Us woman leaves million dollar fortune to pet dog

సంపన్నులకు దేనిపై మక్కువ చూపినా.. అవి అంతకు ముందు లేని ప్రాధాన్యతను సంతరించుకోవడం మామూలే. అయితే ఇక్కడ మరీ విచిత్రంగా ఓ పెంపుడు కుక్కపై ప్రేమను ఒలబోసింది సంపన్నురాలు. ఇకనేం కోటీశ్వరుల జాబితాలో ఆ కుక్క కూడా చేరింది. అమెరికాలో ఓ పెంపుడు కుక్కకు దాదాపు 6 కోట్ల పైచిలుకు విలువ చేసే ఆస్తి దక్కింది. డబ్బుతో పాటు పెద్ద భవంతి, బంగారు నగలు కూడా కానుకగా ఇచ్చారు. కుక్క యజమానురాలు ఈ మేరకు వీలునామా రాయించారు.  


న్యూయార్క్కు చెందిన రోజ్ ఆన్ బొలస్నీ అనే 60 ఏళ్ల మహిళ పెంపుడు కుక్క 'బెల్ల మియా'కు ఈ సంపదను కానుకగా ఇచ్చారు. గతేడాది ఏప్రిల్లో కొనుగోలు చేసిన ఇంటిని కుక్కకు బహుమతిగా అందజేశారు. ఇప్పటిలాగే తన అనంతరం కూడా కుక్కు విలాసవంతమైన జీవితం గడిపేందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రోజ్ తెలిపారు. ఇందుకు ఆమె ఇద్దరు కుమారులు కూడా అభ్యంతరం పెట్టకపోవడం విశేషం. అంతేగాక తల్లి తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికారు.

తన కుమారులకు బెల్లా కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని, బాగా సంపాదిస్తున్నారని, వారికి తన డబ్బు అవసరం లేదని రోజ్ చెప్పారు. ఇక కుక్క ఫ్యాషన్ షోలో కూడా అదరగొడుతోంది. 2013, 2014 బెల్లా వరుసగా న్యూయార్క్ పెట్ ఫ్యాషన్ షోలో విజేతగా నిలిచింది. వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచింది బెల్లానే కావడం విశేషం. బెల్లా తన జాతి కుక్కల్లో స్టార్లా వెలిగిపోతోంది. మంచి డ్రెస్సులు కూడా ఉన్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pet dog  United States  million-dollar fortune  

Other Articles