Nepal plunges into political crisis

Prime Minister Narendra Modi, Nepal, SAARC summit, modi advices for nepal, draft nepal constitution on time, constitution based on consensus, Nepal political crisis, nepal new constitution, Nepali Congress, Communist Party of Nepal, voting on contested constitutional issues, nepal federalism, nepal form of government, nepal election system, nepal judiciary. nepal opposition parties, Maoists and Tarai parties, Maoist members vandalized the Constituent Assembly,

Nepal is sliding into a political crisis in the run up to Thursday’s deadline for a new constitution.

వాగ్వాదం.. బూతు పురాణం.. దాడులకు తెగబడటం..

Posted: 01/21/2015 06:26 PM IST
Nepal plunges into political crisis

హిమాలయ పర్వతశ్రేణుల కింత నిత్యం శీతలంగా వుండాల్సిన నేపాల్ పార్లమెంటులో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఇటీవల జరిగిన సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సులో భాగంగా నేపాల్ లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ సూచనలను పెడచెవిన పెట్టిన ఫలితం అక్కడ ప్రభుత్వానికి ఎదురైంది. నిర్ణీత గడువు ముగిసే లోపు రాజ్యాంగ రచనను పూర్తి చేయాలని, అందరి అభిప్రాయాల మేరకు రాజ్యాంగ రచన వుండాలని మోడీ అప్పుడే అక్కడి ప్రభుత్వానికి సూచించారు. అయితే అందరి సూచనలను తీసుకుని తన మదికి తోచిన విధంగానే నడుచుకున్న ప్రభుత్వానికి ప్రతిపక్షాలు చుక్కలు చూపించాయి.

రేపటితో ముగియనున్న రాజ్యంగ రచన గడువు కోసం ఓటింగ్ పద్దతిని పాటించాలని అధికార పక్ష పార్టీల నిర్ణయంతో ఓటింగ్ సందర్భంగా చర్చ జరుగుతున్న క్రమంలో అధికార నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ అఫ్ నేపాల్ లకు చెందిన సభ్యులపై విపక్షాలైన మావోయిస్టు, తరాయ్ పార్టీల సభ్యులు పరస్పర దాడులకు పాల్పడ్డారు.. విపక్ష సభ్యులు అధికార పక్ష సభ్యులపై కుర్చీలు విసిరి వేశారు. బూతులు తిడుతూ.. నానా రభస చేశారు. అంతటితో ఆగకుండా దాడులకు కూడా పాల్పడ్డారు.

నేపాల్ రాజ్యాంగ రచనలో పొందుపర్చిన పలు వివాదాస్పద అంశాలపై ఓటింగ్ కోసం ప్రశ్నావళి తయారీ కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అసెంబ్లీ చైర్మన్ అనుమతించారు ఇక ఇక్కడ నుంచి గొడవ మొదలైంది. ఈ కమిటీ రాజ్యాంగ విరుద్ధమని నేపాల్ మావోయిస్టు పార్టీ నేతృత్వంలోని విపక్ష కూటమి మండిపడింది. అయితే దీనిని అధికార పక్ష గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. తమ చర్యను సమర్థించుకుంది. దీంతో మరింత రెచ్చిపోయిన విపక్ష సభ్యులు కుర్చీలు విరగ్గొట్టారు. మార్షల్స్‌పైనా దాడికి దిగారు.
 
ఓటింగ్ ద్వారా రాజ్యాంగాన్ని రచించాలన్న ప్రభుత్వ యత్నానికి నిరసనగా విపక్ష కూటమి దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఇక రాజ్యంగ రచనకు అమోదం లభించే అవకాశాలు మృగ్యం అయ్యాయి. అయితే నేపాల్ ఉన్నత విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ సభ్యులు కొంత పట్టుదలలకు వెళ్లిన కారణంగానే సభలో అలజడికి కారణమైందని, ఎట్టి పరిస్థితుల్లో తామంతా ఒక్కటై.. చివరి క్షణంలోనైనా రాజ్యాంగ రచన అమోదం పొందేలా చూస్తామని చెప్పకోచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parliament  Opposition Attack  Nepal Constituent Assembly  Nepal Maoist Party  

Other Articles