తెలంగాణ ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు, ఇవాళ ఉదయం పార్టీ ముఖ్యనేతలో భేటీ అయిన రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఆయన వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి పార్టీ పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరిని పిలిపిచారు. ఆ తరువాత వెనువెంటనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనంతరం ఉపముఖ్యమంత్రిగా వున్న తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ముఖ్యమంత్రి సిఫార్సుతో గవర్నర్ నరసింహన్ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ప్రకటించారు, వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఆ శాఖను నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజయ్యను తప్పించారు.
ఆ వెంటనే వడివడిగా మంత్రివర్గానికి సంబంధించిన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజయ్య సామాజిక వర్గానికి చెందిన వరంగల్ పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరికి ఉపముఖ్యమంత్రి పదవి కేటాయించాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వం.. వెంటనే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా గవర్నర్ నరసింహన్ కు తెలియపర్చింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. గవర్నర్ నరసింహన్, కడియం శ్రీహరి చేత ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేయించారు.
రాజ్‌భవన్‌లో జరిగిన కడియం శ్రీహరి ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఈటెల, జోగు రామన్న, ఎంపీ కేకే తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తాను భాగస్వామినవుతానని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు కష్టపడి సైనికుడిలా పనిచేస్తానని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రిగా సీఎం ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేశానన్నారు.
ఇటీవల రాష్ట్రంలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను తొలగిస్తూ నిర్ణయం తీసకున్న కేసీఆర్ ప్రభుత్వం ఆ తరువాత మంత్రుల శాఖలను కూడా మారుస్తూ పలు మార్పలు చేసింది. తాజాగా, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కడియం శ్రీహరికి విద్యా శాఖ, మరో మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖను, జగదీశ్వర రెడ్డికి విద్యుత్ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more