What is obamas lunch menu

obama and modi talks, obama food, what modi offered obama, obama lunch, obama lunch menu, obama modi visit 2015, barrack obama, america president barrack obama, palam airport, narendra modi, prime minister modi, red carpet welcome, india welcomed obama, michelle obama, american first lady michelle obama, modi hugs obama, obama shake hands modi, pakistan media, pak media says big development, pranab mukharjee,

what is america president barrack obama lunch menu, what did modi offered to obama..?

భారత్ పర్యటనలో ఒబామా ఏం తిన్నారు.. మోడీ ఏం వడ్డించారు..?

Posted: 01/25/2015 09:18 PM IST
What is obamas lunch menu

దసరా శరన్నవరాత్రుల సమయంలో అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ.. అక్కడి శ్వేత సౌదంలో అగ్రరాజ్య అద్యక్షుడు ఒబామా ఇచ్చిన విందులో కేవలం మంచినీళ్లను మాత్రమే సేవించారు. అయితే భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌజ్లో ఒబామా, మోదీ కలసి భోజనం చేశారు. శాఖహారి అయిన మోదీ.. ఒబామా కోసం వెజ్, నాన్వెజ్ భారతీయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.

విందులో వెజ్, నాన్వెజ్ వంటకాలతో రెండు మెనూలు ఏర్పాటు చేశారు. కశ్మీర్ వంటకం నడ్రు కె గూలర్, బెంగాల్ వంట మహి సర్సాన్తో పాటు షట్వార్ కా షోర్బా, అనానస్ ఔర్ పనీర్ కా సూలా, మటర్ పలావ్, గుజరాతీ కడీ, మిక్స్డ్ వెజిటబుల్ కలోంజి, కెలా మేథీ ను షాక్, పనీర్ లబబ్దార్, గాజర్ కా హల్వా, గులాబ్ జామూన్, పండ్లను సిద్ధంగా ఉంచారు. ఒబామా ఏయే పదార్థాలను రుచి చూశారో బయటకు తెలియరాలేదు. దక్షిణ భారత దేశంలో తాగే కాఫీ, హెర్బల్ టీని అందజేశారు. ఒబామాకు ఈ రోజు రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఇవ్వనున్నారు. వెజ్తో పాటు నాన్వెజ్ వంటకాలను వడ్డించనున్నారు. మటన్ రోగన్ జోష్, గలౌటీ కబాబ్, పనీర్ మలై టిక్కా మెనూలో చేర్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama modi visit 2015  Lunch-menu  modi's host  

Other Articles