Delhi people republic day celebrations

delhi republic day celebrations, delhi people, republic day celebrations

delhi people republic day celebrations : The delhi people didn't leave the ground while the rain is coming from morning.

శభాష్.. దేశప్రతిష్టను కాపాడిన ఢిల్లీ ప్రజలు!

Posted: 01/26/2015 10:36 AM IST
Delhi people republic day celebrations

గణతంత్రదినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ ప్రజలు తమ భారతీయతను చాటిచెప్పారు. దేశం గర్వించదగ్గ అరుదైన ఘనకార్యాన్ని చేసి నిరూపించుకున్నారు. ఈ ఘటనను చూసిన ప్రతిఒక్కరు చలించిపోయారు. భారతీయులు అని కేవలం చెప్పుకోవడం కాదు.. దానికి అనుగుణంగా ఏదైనా కార్యాన్ని చేసి చూపించాలన్న సందేశాన్ని యావత్తు భారతదేశానికి అందించారు.

ఢిల్లీలో ఎంతో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు దేశనలమూలల నుంచి భారీసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అయితే.. ఉదయం నుంచి ఢిల్లీలో ఓ మోస్తరు వర్షం కురవడం ప్రారంభమయ్యింది. పైగా చలిగాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. అయినప్పటికీ వీటిని పట్టించుకోకుండా ఏ ఒక్కరు అక్కడి నుంచి కదలలేదు. వర్షం కురుస్తున్నా అందులో తడుస్తూనే వేడుకల కల కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ అలాగే వుండిపోయారు. ఈ ఘటనను చూసిన సాటి భారతీయులు సైతం చలించిపోయారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi republic day celebrations  delhi people  republic day celebrations  

Other Articles