Delhi rajpath republic day festival narendra modi obama couple pranab mukherjee

delhi republic day festival, obama couple republic day festival, narendra modi news, pranab mukherjee news, pranab mukherjee republic day festival, narendra modi republic day festivals

delhi rajpath republic day festival narendra modi obama couple pranab mukherjee : the republic day festivals held in delhi.

మంచువర్షంలోనే ఘనంగా ‘గణతంత్ర’ వేడకలు...

Posted: 01/26/2015 10:56 AM IST
Delhi rajpath republic day festival narendra modi obama couple pranab mukherjee

భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో 66వ గణతంత్ర వేడుకలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా బరాక్ ఒబామాతోపాటు అతని భార్య మిషెల్ ఒబామా కూడా హాజరయ్యారు. ముందుగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని మోదీ అమర సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి ఆయన రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. ఇక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి కొద్దిసేపు ముందు ఒబామా దంపుతులు హాజరయ్యారు. వాళ్లు హాజరైన కొద్దిసేపటి తర్వాత ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఇదిలావుండగా.. ఓవైపు విపరీతమైన మంచువర్షం కురుస్తున్నప్పటికీ దేశనలమూలల నుంచి ఈ వేడుకలకు హాజరైన ప్రజలు అక్కడి నుంచి కదలకుండా అలాగే వున్నారు. దాదాపు వర్షంలా కురుస్తున్నా కూడా ముఖ్యఅతిథులతోపాటు హాజరైన వాళ్లందరూ గొడుగులు పట్టుకునో, తలపై పుస్తకాలు పెట్టుకునో వుండక తప్పలేదు. పెరేడ్ గ్రౌండ్ కూడా మొత్తం మంచుతోనే తడిసి ముద్దయ్యింది. అయినప్పటికీ అదే వాతావరణంలో జవాన్లు తమ విధులు నిర్వహించారు. ఈ ఘటనను చూసిన ప్రతిఒక్కరు చలించిపోయారు.

మరోవైపు.. ఈ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీరజవాన్లకు పతకాలు అందజేశారు. అత్యున్నత సైనిక పురస్కారమైన అశోకచక్రను దివంగత సైనికాధికారుల భార్యలకు అందించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 66 republic day festivals  narendra modi barack obama  pranab mukherjee  

Other Articles