Saleem khan padma sri award narendra modi government salman khan

saleem khan, saleem khan latest news, salman khan news, salman khan press meet, salman khan interview, saleem khan salman khan, padma sri award list, padma sri award winners, padma sri list, narendra modi government, pm narendra modi news

saleem khan padma sri award narendra modi government salman khan : bollywood famous writer saleem declained the padmasri award.

‘నా హోదాకు పద్మశ్రీ తగిందికాదు’ : సల్మాన్ ఖాన్ తండ్రి

Posted: 01/26/2015 09:40 AM IST
Saleem khan padma sri award narendra modi government salman khan

భారత ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం అర్హుల జాబితాలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ కూడా వున్న విషయం తెలిసిందే! బాలీవుడ్’లో సినీరచయితగా విధులు నిర్వహిస్తున్న ఈ 79 ఏళ్ల సలీమ్’కు చాలాకాలం తర్వాత ఈ గౌరవం దక్కింది. దీంతో తనకు దక్కిన ఈ అవార్డుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు కానీ.. ఈ అవార్డు తన హోదాకు సరిపోదని దానిని తిరస్కరించారు. తన హోదాకు, చేస్తున్న పనికి ఆ పురస్కారం ఎట్టిపరిస్థితుల్లోనూ సరిపోదని ఆయన ఖరాఖండీగా తేల్చి చెప్పారు.

‘‘చాలా ఏళ్లుగా కేంద్రప్రభుత్వం నన్ను నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. సినీ పరిశ్రమలో నా సహచరులు, వయసులో నాకన్నా చిన్నవాళ్లను (జూనియర్లను) కేంద్రం ‘పద్మ’ పురస్కారంతో గౌరవించింది. కానీ.. అప్పుడు నన్ను గుర్తించలేదు. కానీ.. తాజాగా విడుదలైన పద్మ అవార్డుల జాబితాలో నాపేరు వుందని ఇటీవలే నాకు తెలిసింది. అప్పుడే అనుకున్నా.. నేను పొందాల్సిన దాన్ని ఎట్టకేలకు సాధించానని. కానీ.. కేంద్ర హోంమంత్రిత్వశాఖ నన్ను ‘పద్మశ్రీ’కి ఎంపిక చేసిందని తెలియగానే అది నాకు తగిందికాదని భావించాను’’ అని పేర్కొన్నారు. అయితే.. కనీసం ఇన్నాళ్లకు తనను గుర్తించి ఈ పద్మశ్రీ అవార్డును ప్రకటించినందుకుగానూ ఆయన ప్రస్తుత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

గత ప్రభుత్వాలు తనకన్నా జూనియర్లను పద్మశ్రీ, పద్మవిభూషణ్, ఇతర అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో సలీమ్ ఖాన్’కు ఏవీ దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పుడు దక్కిన పురస్కారం తనకు సంతోషంగానే వుందని తెలిపిన ఆయన.. చాలా ఆలస్యంగా దక్కిందని దానిని తిరస్కరించారు. అంతేకాదు.. ‘‘తనకున్న హోదాకు పద్మశ్రీ ఆలస్యంగా వస్తే ఎవరైనా స్వీకరిస్తారా చెప్పండి..?’’ అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈయన అసంతృప్తికి మోదీ ప్రభుత్వం ఏ విధమైన సమాధానమిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saleem khan padma sri  salman khan updates  narendra modi  

Other Articles