Barack obama chewing gum indian republic day festival

barack obama news, barack obama chewing gum, barack obama chewing gum republic day, obama chewing gum republic day, barack obama narendra modi, barack obama republic day festivals, delhi republic day celebrations, pranab mukherjee news

barack obama chewing gum indian republic day festival : Obama pops chewing gum back in his mouth as he watches the Republic Day parade

ఒబామా ‘చూయింగ్ గమ్’ @రిపబ్లిక్ డే.. సంచలనం!

Posted: 01/26/2015 12:59 PM IST
Barack obama chewing gum indian republic day festival

భారతదేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ఎంతో వైభవంగా నిర్వహించిన 66వ గణతంత్రదినోత్సవ వేడుకల్లో ఒబామా ‘చూయింగ్ గమ్’ సంచలనంగా మారింది. ప్రస్తుతం దీనిగురించే సామాజిక మాధ్యమాల్లో పెద్దయెత్తున చర్చలు జరుగుతున్నాయి. ఓవైపు ప్రముఖులతోబాటు దేశప్రజలు వేడుకల్లో నిమగ్నమై వుంటే.. ఒబామా మాత్రం జాలీగా చూయింగ్ మింగుతూ కూర్చోవడం అందరికీ ఆగ్రహాన్ని గురిచేసింది.

గణతంత్ర వేడుకల సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత సైనిక దళాలు తమ పాటవాన్ని ప్రదర్శిస్తున్నాయి. అలాగే హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురుస్తోంది. ఈ ప్రదర్శనలు చూసిన ప్రతిఒక్కరు ఎంతో ఎగ్జైట్’మెంట్’తో చప్పట్లు కొడుతూ సంతోషంగా వున్నారు. కానీ.. బరాక్ ఒబామా మాత్ర వాటిని ఆస్వాదిస్తూనే చూయింగ్ గమ్ నములుతూ కనిపించారు. అంతేకాదు.. మధ్యమధ్యలో దాన్ని బయటకు తీస్తూ, మళ్లీ నోట్లోకి పెట్టుకోవడం లాంటి దృశ్యాలు కెమెరాకి చిక్కాయి. దీంతో సగటు భారతీయులు దీని గురించి రకరకాలు చెప్పుకుంటున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన ప్రదర్శనల భాగంగా రాజకీయ ప్రముఖులతోబాటు ప్రజలందరూ మర్యాదపూర్వకంగా తిలకిస్తుంటే.. ఒబామా మాత్రం దాన్ని నిర్లక్ష్యంగా భావిస్తున్నట్లున్నారని అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. అయితే.. వైట్ హౌస్ కరెస్పాండెంట్ పీటర్ బాకర్ మాత్రం అది ‘నికోరేట్టీ’ అయి వుండవచ్చునని ట్వీట్ చేశారు. మరోవైపు మరికొంతమంది భారతీయులు దీనిని లైట్ తీసుకున్నారు. ఒబామా గుట్కా అయితే నమలడం లేదు కదా అంటూ ప్రశ్నించుకుంటున్నారు. ఏదైతేనేం.. ఇక్కడ ఒబామా చూయింగ్ మాత్రం పెద్ద సంచలనాన్నే సృష్టించింది.

ఇదిలావుండగా.. ఇంతకుముందు బీజింగ్’లో జరిగిన ఆసియా పషిఫిక్ ఆర్థిక సమితి (అపెక్) సమావేశాల నేపథ్యంలోనూ ఒబామా ఇదే తరహాలో చూయింగ్ గమ్ నములూ కనిపించారు. అప్పుడు ఆ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద వివాదమే రేగింది. ఆ సదస్సులో ఒబామా పలు సందర్భాల్లో చూయింగ్ నములుతూ తీస్తు కనిపించారని ఓ ఇంగ్లండ్ పత్రిక తీవ్రంగా విమర్శించింది. మరి.. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించిన ఒబామాపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తుతాయో!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles