Legendary cartoonist r k laxman passes away in pune

cartoonist R K Laxman, cartoonist R K Laxman passes away, India's legendary cartoonist, Legendary cartoonist R K Laxman passes away, Rk laxman dead, laxman suffered urinary tract infection, laxman suffered multi organ failure, dinanath mangeshkar hospital, laxman suffered several storkes,

India's legendary cartoonist R K Laxman passed away on Monday after a complicated urinary tract infection. He was 94.

ఆరు దశాబ్దాలు అలరించిన కుంచే..జారీపోయింది..

Posted: 01/27/2015 09:19 AM IST
Legendary cartoonist r k laxman passes away in pune

ప్రముఖ కార్టూనిస్ట్ దిగ్గజం ఆర్కే లక్ష్మణ్ కన్నుమూశారు. మూత్ర నాలంతో ఇన్ ఫెక్షన్ కారణంగా పూణే లోని ధినానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొంబై నాలుగేళ్ల లక్ష్మణ్ నిన్న రాత్రి పరమపదించారు. అంతకు ముందు కూడా కొన్ని నెలలుగా ఇదే సమస్యతో ఆయన మంచానపడ్డారు. ఈ నెల 16 శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ సాయంతో చికిత్సను అందించినప్పటికీ పది రోజుల ఆనతంర ఆయన మరణించారు.

లక్ష్మణ్ శరీరంలోని అవయవాలు ఒక్కక్కటిగా క్రమంగా పనిచేయకపోవడంతో, అంతకు ముందే ఆయన పలుమార్లు గుండెకు  సంబంధించిన సమస్యలను ఎదుర్కోవడంతో చికిత్సకు కూడా శరీరం సహకరించలేదని  వైద్యులు తెలిపారు. 1924లో కర్ణాటకలోని మైసూరులో జన్మించిన ఆయన వృత్తి రిత్యా స్వస్థాలన్ని వదిలి మహారాష్ట్రలోని పూణేలో స్థిరపడ్డారు. ముంబైలోని బ్లిట్స్ మ్యాగజైన్ మంచి కర్టూనిస్టుగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత ఆయన ప్రముఖ కార్టూనిస్టు, శివసేన వ్యవస్థాపక అద్యక్షుడు బాల్ థాకరేతో కలసి ఫ్రీ పెస్ జన్రల్ లో పనిచేశారు.

లక్ష్మణ్ తన కలంతో గీసిన కర్టూన్లతో ఒక సామాన్య మనిషిగా రాజకీయ నాయకుల వైఖరిని ఎప్పటికప్పుడు విమర్శించేవారు.  కార్టూనిస్టుగా తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ పయంలో లక్ష్మణ్ జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలతో పాటు అనేక మంది ప్రముఖ రాజకీయ నేతల కార్టూన్లను గీసి, తన విమర్శనాలను ఎక్కుపెట్టారు. కర్టూనిస్టుగా లక్ష్మణ్ తన కెరీర్ లో అనేక అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. మగసెసే అవార్డుతో పాటు పద్మభూషన్, పద్మ విభూషన్ అవార్డులు కూడా తన కెరీర్ లో చేరాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RK Laxman  cartoonist  passed away  Urinary Tract Infection  

Other Articles