ఆయన అమెరికా, అదేనండి ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యంగా వెలుదఃగొందుతున్న దేశానికే అధ్యక్షుడు. ఆయనే బరాక్ ఒబామా. అగ్రరాజ్య అధ్యక్షుడి హోదాలో ఇప్పటి వరకు ఉన్న పరిధులను ఆయన దాటుకుని గతంలో ఎవర్వూ చేయని పనులను ఆయన చేశారు. అధ్యక్షుడి హోదోలో ఒకే దేశాన్ని రెండు సార్లు పర్యటించడం, భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిధి హోదాలో హాజరుకావడం. ఈ సందర్భంగా ఆయన ఎర్రకోట వద్ద సుమారు నాలుగు వందల మీటర్లను కూడా నడిచారు.
ఇది పక్కన బెడితే.. ఒబామా రాకకు ముందుగానే ఆయన వాహనం బీస్ట్ ముందే వచ్చి చేరుతుంది. సుమారు మూడు లక్షల అమెరీకన్ డాలర్లతో.. (అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాల పద్దెనిమి కోట్ల రూపాయాలు) రూపొందిన ఈ కారులోనే అధ్యక్షుడు పర్యటిస్తారు. భద్రతా నేపథ్యంలో ఏ ధేశ పర్యటనకు వెళ్లినా.. ఆగ్రరాజ్యం తమ అధ్యక్షుడి వాహానాన్ని ముందుగానే పంపుతుంది. అలానే భారత్ కూడా పంపారు. అయితే ఈ వాహనం బుల్లెట్లను, మిసైళ్ల దాడిని కూడా నిర్వీరం చేస్తుందని, అందుకనే ఈ అధ్యక్షులు ఏక్కడికి పర్యటనకు వెళ్లినా దీనినే వినియోగాస్తారని వైట్ హైస్ వర్గాల వెల్లడి. అయితే భారి మిసైల్ ను కూడా నిర్వీర్యం చేసే ఈ వాహనం ఓ చిన్న ర్యాంప్ కూ మాత్రం అధిగమించలేకపోయింది.
2011లో ఒబామా, తన సతీమణి మిషెల్లి తో కలసి వారం రోజుల పాటు యూరోప్ దేశాల పర్యటన నిమిత్తం వెళ్లారు. అందులో భాగంగానే ఐర్లాండ్ దేశంలో పర్యటించారు. అక్కడ డంబ్లిన్ లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి పర్యటనలో భాగంగా బయలుదేరి వస్తున్న క్రమంలో రాయబార కార్యాలయం దాటే సమయంలో కారు ర్యాంప్ కూ ఇరుక్కుపోయింది. ఒబామా.. సహా ఆయన సతీమణి ఇద్దరు కారులో వుండగానే ఈ పరిణామాం ఎదురుకావడంతో సెక్యూరిటీ కిందకు దిగి.. చూశారు. కారు కింద బాగం చాలా కిందకు వుండటం కారణంగానే కారు ర్యాంప్ పై ఇరుక్కుపోయిందని గ్రహించి.. మెల్లిగా ఎలాగోలా మొత్తానికి గట్టేకించారు. ఆ తరువాత నింపాదిగా అధ్యక్షుల వారి భద్రతా సిబ్బంది.. ఈ కారు స్పేర్ కారని, అసలైన కారు అమెరికాలో బాగానే వుందని ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం అప్రస్తుతమే అయినా.. అవగాహన కోసమే ఈ కథనం
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more