Telangana cm kcr state new secretariat yerragadda chest pain hospital

cm kcr news, telangana government news, cm kcr new secretariat, telangana secretariat, telangana ministers, andhra pradesh secretariat

telangana cm kcr state new secretariat yerragadda chest pain hospital : telangana cm kcr is planning to built 100 floor secretariat for their ministers in yerragadda chest pain hospital place.

ఆకాశహర్మ్యంలో సచివాలయం..?

Posted: 01/28/2015 01:41 PM IST
Telangana cm kcr state new secretariat yerragadda chest pain hospital

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరికొత్త ప్రతిపాదనలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే! అంతర్జాతీయ తరహాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనలో వున్న సీఎం కేసీఆర్.. ఇప్పటికే పోలీస్ శాఖలో కొత్తవాహనాలతోపాటు పలుమార్పులు చేశారు. అదేవిధంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేవిధంగా పావులు కదుపుతున్నారు. తనదైన ఆలోచనవిధానంతో ముందుకెళ్తున్న కేసీఆర్.. తాజాగా కొత్త సచివాలయ నిర్మాణ వ్యవహారాల యోచనలో వున్నట్లు సమాచారం! ఇదివరకెన్నడూలేని విధంగా విలాసవంతమైన సౌకర్యాలతో సుమారు 100 అంతస్తుల సచివాలయాన్ని నిర్మించాలనే ప్లాన్’లో వున్నట్లు సమాచారం! ప్రస్తుతమున్న సచివాలయం అంత సౌకర్యవంతంగా లేకపోవడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సచివాలయం 21 ఎకరాల్లో వుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వుంది కాబట్టి ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక్కడ సాగుతున్నాయి. దీంతో ప్రభుత్వ పాలనకు ఈ సచివాలయం అనువుగా లేదని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు, భద్రతపరమైన ఇబ్బందులతోపాటు భవనాలు చాలా ఇరుకుగా వున్నాయి. పైగా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒకటే సచివాలయం కావడంతో మంత్రుల సంఖ్య పెరిగి చాలా ఇబ్బందిగా మారిందని వారి అభిప్రాయం. అందుకే.. సాధ్యమైనంతవరకు సువిశాల స్థలంలోకి సచివాలనం తరలించాని సీఎం భావిస్తున్నారు. తమ ప్రభుత్వ పాలనకు అనువుగా వుండే విధంగా విశాలమైన స్థలంలో నిర్మాణ వ్యవహారాలను చేపట్టేందుకు కేసీఆర్ అప్పుడే పావులు కదిపినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. తమ రాష్ట్ర సచివాలయాన్ని ఎర్రగడ్డలోని ఛాతీవ్యాధుల ఆసుపత్రి స్థలంలోకి మార్చాలని కేసీఆర్ యోచిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు 125 ఎకరాలమేర ఖాళీగా వున్న ఈ స్థలంలో తమ పాలనకు అనువుగా వుండేవిధంగా అధునాతన వసతులతో నిర్మించవచ్చనే ఆలోచనతో ఈ స్థలాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రదేశంలో దాదాపు 100 అంతస్థులతో భారీ భవన సముదాయాన్ని నిర్మించిన తర్వాత తెలంగాణ సచివాలయాన్ని అందులోకి మారుస్తారు. అలాగే మంత్రులు, అధికారులకు ప్రత్యేక నివాసాలను నిర్మించాలని తెలంగాన ప్రభుత్వం భావిస్తోంది. ఇక మిగిలిన స్థలాన్ని స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల నిర్వహణకు అనువైన విశాల మైదానంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయని సమాచారం!

ఇటీవలే సీఎం కేసీఆర్ ఈ ఆసుపత్రిని సందర్శించి, స్థలాన్ని పరిశీలించారు. ఛాతీవ్యాధులకు సంబంధించిన ఆసుపత్రి నగర నడిమధ్యలో వుండటం వల్ల కాలుష్యంతోపాటు ఇతర సమస్యలు ఎదురవుతున్నాయన్న సందర్భంగా ఆయన దానిని సందర్శించారు. అనంతరం ఆ ఆసుపత్రిని వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. ఈ ఆసుపత్రితో నగరంలో కాలుష్యం మరింతగా పెరిగే అవకాశముందని, తద్వారా రకరకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదముందని భావించిన ఆయన ఈ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆ స్థలం ఖాళీగా వుంటుంది కాబట్టి.. అందులో ఆకాశహర్మ్యంలా సచివాలయాన్ని నిర్మించే యోచనలో భాగంగా చకచకా కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles