Kalvakuntla chandrasekhar rao chandrababu naidu narasimhan republic day vastu problems

kcr latest news, kcr press meet, kcr latest updates, kcr news, kcr controversies, chandrababu naidu latest news, chandrababu naidu press meet, chandrababu naidu latest updates, kcr chandrababu naidu, kcr chandrababu naidu narasimhan, kcr babu vastu, kcr vastu babu, kcr babu narasimhan, republic day festivals

kalvakuntla chandrasekhar rao chandrababu naidu narasimhan republic day vastu problems : telangana cm kcr suggestions to andhra pradesh cm chandrababu naidu to change his vastu of office.

చంద్రబాబుకు ‘వాస్తు’ హెచ్చరిక ఇచ్చిన కేసీఆర్

Posted: 01/29/2015 10:08 AM IST
Kalvakuntla chandrasekhar rao chandrababu naidu narasimhan republic day vastu problems

ప్రాచీన సంస్కృతీ-సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా ఈ విషయంలో హిందువులు ఎప్పటికీ ముందుంటారు. శాస్త్రాలప్రకారం గృహాలను నిర్మించుకోవడం, శుభ-అశుభ ఘడియలప్రకారం కార్యక్రమాలను నిర్వహించుకోవడం, ఇంకా ఇతరత్ర ఆచారాలను నమ్ముతారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ‘వాస్తు’! వాస్తు ప్రకారం ఇళ్లను నిర్మించుకుంటే అన్ని కార్యాలు మంచిగా జరుగుతాయని అందరి నమ్మకం! అందుకే.. ఇళ్లు నిర్మించుకోవడానికి ముందు వాస్తు ప్రకారం ప్లాన్ వేసుకుంటారు.

ఇదే ‘వాస్తు’ విషయంపై తెలంగాణ, ఏసీ ముఖ్యమంత్రులిద్దరికీ ఎంతో అపారమైన నమ్మకం వుంది. తాము చేసే ప్రతి కార్యక్రమానికి ముందు వాస్తు దోషాలను చూసుకుని మరీ ముందడుగు వేస్తారు. అది ఎంత పెద్ద పనైనా సరే.. వాస్తు సరిపోకపోతే దాన్ని ఆ కార్యాన్ని వాయిదా వేసుకుని మంచి సమయం ఎప్పుడుందో అప్పుడే చేస్తారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు తూచాతప్పకుండా పాటిస్తే.. కేసీఆర్’కు ఇందులో మరింత ఎక్కువగా పట్టుంది. ఆయనకు ఇందులో ఎంతగా అవగాహన వుందంటే.. ఇతరులకు ఈ వాస్తు గురించి సూచనలు కూడా ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబుకు ఓ ‘వాస్తు’ హెచ్చరిక చేసినట్లు తెలిసింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాబు, కేసీఆర్ ఇద్దరు గవర్నర్ సమక్షంలో దాదాపు గంటకుపైగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే కేసీఆర్, బాబుకు వాస్తు హెచ్చరిక చేసినట్లు సమాచారం. ‘‘మీ కార్యాలయం వాస్తు బాగా లేదు.. త్వరలోనే వాస్తు దోషాలను సరిచేసుకోండి’’ అంటూ ఆయన బాబుకు సూచించారట! కేసీఆర్ తనను ఈ విధంగా హెచ్చరించడంపై సందిగ్ధంలో మునిగిపోయిన బాబు.. తన కార్యాలయం వాస్తుపై మరోసారి పరిశీలన చేయించాలని అప్పుడే అనుచరులకు ఆదేశాలు కూడా జారీ చేశారట! పరిశీలన అనంతరం కొన్ని మార్పులు చేసే అవకాశాలు వున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు కార్యాలయం ‘ఎల్’ బ్లాకులో ఏర్పాటైన సంగతి విదితమే! తొలుత ఆయనకు సౌత్ హెచ్ బ్లాకును కేటాయించినా.. వాస్తు బాగాలేదన్న కారణంగా బాబు తన కార్యాలయాన్ని ‘ఎల్’ బ్లాకులో ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం ఏపీ సర్కార్ రూ.20 కోట్లు కూడా అప్పట్లో ఖర్చు చేసింది కూడా! ఇప్పుడీ కార్యాలయం వాస్తు బాగోలేదనే కేసీఆర్ హెచ్చరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalvakuntla chandrasekhar rao  chandrababu naidu  narasimhan  

Other Articles