Arvind kejriwal kiran bedi cm post offer delhi assembly elections national media

arvind kejriwal, kiran bedi, delhi assembly elections, bjp party, aam aadmi party, arvind kejriwal press meet, arvind kejriwal kiran bedi, kiran bedi latest news, arvind kejriwal latest news, delhi elections, bjp party ministers

arvind kejriwal kiran bedi cm post offer delhi assembly elections national media : aam aadmi party president arvind kejriwal remembered his past days that their party had already given cm post offer to kiran bedi in the last elections.

కిరణ్ బేడీకి సీఎం పోస్ట్ ఆఫర్ చేసిన కేజ్రీవాల్

Posted: 01/29/2015 05:21 PM IST
Arvind kejriwal kiran bedi cm post offer delhi assembly elections national media

ఫిబ్రవరి 7వ తేదీన ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్’లో పోటీ చేయనున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీకి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మధ్య వాదోపవాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో గురువారం జాతీయ మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్... కిరణ్ బేడీకి సీఎం ఆఫర్’ని ప్రకటించినట్లు తెలిపారు. ఆమె విధివిధానాలు నచ్చి ఆమెకు ముఖ్యమంత్రి పదవిని తమ పార్టీ కట్టబెట్టినట్లు పేర్కొన్నారు. అయితే.. ఆయన ఆఫర్ ఇస్తున్నది ఇప్పుడు కాదులెండి.. గతంలో ఈయన పార్టీ పెట్టిన మొదటిరోజుల్లో ఈమెకు సీఎం ఆఫర్ ఇచ్చినట్లు తాజాగా గుర్తు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి అప్పట్లోనే ఆ పదవిని ఇవ్వడానికి ఆఫర్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. గతంలో తమ పార్టీ పోటీకి దిగేటప్పుడే ఆమెకు సీఎం పదవిని ఆఫర్ చేశామని తెలిపారు. బేడీ విధివిధానాలు నచ్చే తాము అప్పట్లో సీఎం పదవికి ఆమెను ఆఫర్ చేశామన్నారు. అయితే.. తాజాగా తన పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ మాయమాటలతో కిరణ్ బేడీని లొంగదీసుకుందని.. ఎన్నికల్లో దింపి ఆమెను బలిపశువును చేసిందని కేజ్రీ వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా.. కిరణ్ బేడీ తనపై ఎన్ని విషపూరిత వ్యాఖ్యలు సంధించినా.. ఆమెపై తనకు ఎప్పటికీ గౌరవమే వుంటుంది, ఆమెను కించపరిచేవిధమైన వ్యాఖ్యానాలు ఎప్పటికి చేయనని అన్నారు. ఇక మీడియావాళ్లు అడిగిన ఓ ప్రశ్నకు కేజ్రీ జవాబు చెబుతూ.. ఫిబ్రవరి 10 తేదీ తర్వాత కిరణ్ బేడీని బీజేపీ పార్టీ మర్చిపోవడం ఖాయమని సమాధానమిచ్చారు. అంటే.. తమ ఆప్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మకంతో వున్నట్లు తెలుస్తోంది. మరి.. ఢిల్లీ ప్రజలు ఈసారి ఎవరిని పీఠాధిపతిగా ఎన్నుకుంటారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal press meet  kiran bedi news  delhi assembly elections  

Other Articles