Music director chakri forensic report sravani family members clashes

chakri death news, chakri death forensic report, chakri forensic report, chakri family members, chakri wife sravani, chakri wife family members, chakri death report, music director chakri news, music director chakri forensic report

music director chakri forensic report sravani family members clashes : Finally the forensic report of chakri death has came. The report has revealed chakri death is normal and there are no poision found in chakri body.

ఫోరెన్సిక్ రిపోర్ట్ : చక్రి మరణంపై వీడిన మిస్టరీ!

Posted: 01/29/2015 06:50 PM IST
Music director chakri forensic report sravani family members clashes

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి గతకొన్నాళ్ల కిందట హార్ట్ ఎటాక్’తో మరణించిన విషయం తెలిసిందే! ఈయన మరణానంతరం చక్రి కుటుంబసభ్యులకు, ఆయన భార్య శ్రావణి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో చక్రి మరణం సహజమైనది కాదంటూ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఫిర్యాదుల మేరకు పోలీసులు చక్రి మరణంపై అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అస్థికలను ఫోరెన్సిక్ ల్యాబ్’కు తరలించారు.

చక్రి అస్థికలను బాగా పరిశీలించిన అనంతరం తాజాగా ఫోరెన్సిక్ పరీక్షలు వెల్లడయ్యాయి. ఇన్నాళ్లు ఆయన మరణంపై తలెత్తిన అనుమానాలకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఆయన అస్థికల్లో ఎటువంటి విషపదార్థాలు లేవని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. దాంతో చక్రిది సహజమరణమే తప్ప.. అందులో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదని ఆ రిపోర్టు తేల్చి చెప్పేసింది. ఇకనైనా ఈ రిపోర్టుతో శ్రావణి, అత్తవారి మధ్య విభేదాలు తగ్గుతాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles