Gali janardhan reddy ys rajasekhar reddy nampally cbi court assets case

gali janardhan reddy, ys jagan mohan reddy, nampally cbi court, jagan assets case, gali janardhan reddy bribe case, ys jagan gali janardhan reddy, cbi nampally court news

gali janardhan reddy ys rajasekhar reddy nampally cbi court assets case : When ys jagan and gali janardhan went to nampally cbi court.. jagan called gali as brother.

అరుదైన ఘటన : గాలిని బ్రదర్ అంటూ పిలిచిన జగన్

Posted: 01/30/2015 10:23 AM IST
Gali janardhan reddy ys rajasekhar reddy nampally cbi court assets case

వైఎస్ఆర్ కాంగ్రె అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్నాటక మాజీమంత్రి గాలిజనార్థనరెడ్డి మధ్య అప్పట్లో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే! నిజానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా వున్న సమయంలో ఆయన కుటుంబంతో గాలికి మంచి సంబంధాలే వుండేవి. వైఎస్ఆర్ తనకు తండ్రితో సమానమని, జగన్ తనకు సోదరుడిలాంటా వారని ఆనాడు గాలి మీడియా ముందే ప్రకటించిన సందర్భం వుంది.

అయితే.. అవినీతి కేసుల్లో చిక్కుకున్న తర్వాత వైఎస్ జగన్ ఓ సందర్భంలో పార్లమెంట్ గేటు ముందు ‘‘గాలి జనార్ధన్ రెడ్డి ఎవరు?’’ అంటూ వ్యాఖ్యానించారు. దాంతో గాలి వారి నుంచి దూరమయ్యారు. అప్పటినుంచి వీరిద్దరు కలిసినట్లుగానీ, మాట్లాడినట్లుగానీ ఎన్నడూ కనిపించలేదు. అటువంటి వీరిద్దరి మధ్య అనుకోకుండా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. గాలిని బ్రదర్ అంటూ జగన్ పలకరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అవినీతి కేసుల్లో చిక్కుకున్న వీరిద్దరూ గురువారం (29-01-2015) నాంపలి సీబీఐ కోర్టుకు హాజరైన సంగతి విదితమే! వేర్వేరు కేసుల్లో ఇద్దరూ కోర్టుకు హాజరుకావడంతో ఇద్దరి మధ్య ఓ ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. ఒకే సమయంలో ఒకర్నొకరు ఎదురుపడిన సమయంలో తనకు ఎదురొచ్చిన గాలిని చూసి జగన్ ‘‘హలో బ్రదర్.. ఎలా వున్నారా..? బాగున్నారా?’’ అంటూ పలకరించారు. అయితే గాలి మాత్రం ఈ పలకరింపుకు అంతగా పట్టించుకోకుండా.. ‘‘ఆ.. బాగున్నాను’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జగన్ ఎంత ఆప్యాయంగా పలకరించినప్పటికీ.. గతంలో ఆయన చేసిన కామెంట్’ను గాలి దృష్టిలో పెట్టుకునే అతనితో అంటీముట్టనట్టుగా వ్యవహరించారని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gali janardhan reddy news  ys jagan mohan reddy news  cbi nampally court  

Other Articles