Jayanti natarajan resignation letter sonia gandhi rahul gandhi attitude

jayanti natarajan news, jayanti natarajan resignation letter, sonia gandhi, rahul gandhi, congress party news, jayanti sonia gandhi, sonia rahul gandhi

jayanti natarajan resignation letter sonia gandhi rahul gandhi attitude ; jayanti natarajan write a letter to sonia gandhi about rahul gandhi attitude.

రాహుల్ గాంధీ వల్లే జయంతి రాజీనామా చేసిందా..?

Posted: 01/30/2015 11:22 AM IST
Jayanti natarajan resignation letter sonia gandhi rahul gandhi attitude

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడైన రాహుల్ గాంధీ వైఖరి అంతగా ఏమీ బాగోలేదంటూ గతంలో ఆ పార్టీకి చెందిన మంత్రులే పేర్కొన్న విషయం తెలిసిందే! అంతేకాదు.. రాహుల్ వల్ల ఎంతోమంది నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అతడు ఆ పార్టీకి పెద్ద శాపంగా మారాడంటూ విమనాస్త్రాలను సంధించిన సందర్భాలూ వున్నాయి. ఆయన వల్లే పార్టీని వదిలివెళ్లాల్సి వస్తోందంటూ కొందరు నాయకులు బహిరంగంగా స్టేట్’మెంట్లు ఇచ్చిమరీ రాజీనామా చేశారు కూడా! ఇప్పుడు తాజాగా మరో సీనియర్ నేత రాహుల్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పార్టీని వీడే ఆలోచనలో వున్నారని సమాచారం!

ఇప్పటికే గౌరవమర్యాదలన్నీ కోల్పోయి తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ నేతగా కొనసాగుతూ వస్తున్న కేంద్రమాజీమంత్రి జయంతి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు వున్నాయని అంటున్నారు. అంతేకాదు.. రాహుల్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. రాహుల్ గాంధీ వల్ల తనకు నష్టం గురించి, అతను పన్నిన కుట్రల గురించి, ఇంకా ఇతరత్ర వ్యవహారాల గురించి ఆ లేఖలో పేర్కొంది. నిజానికి ఆమె ఈ లేఖను గత ఏడాది నవంబర్’లోనే సోనియాకు రాసిన.. తాజాగా మీడియాకు లీకైంది.

జయంతి రాసిన లేఖలో రాహుల్’పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. 2013లో అతడు చెప్పినట్లుగా చేయకపోవడం వల్లే తనను బలవంతంగా కేబినెట్ నుంచి తప్పించారని విమర్శించారు. రాహుల్ కార్యాలయంలోనే తనపై కుట్రపథకం సిద్ధమైని ఆమె పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో పార్టీ అగ్ర నాయకత్వం తనను వేధించిందని జయంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఈ విధంగా లేఖలో పేర్కొనడంతో ఆమె రాజీనామా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో తన రాజీనామాపై ఆమె వివరణ ఇవ్వనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayanti natarajan resignation letter  sonia gandhi  rahul gandhi  congress party  

Other Articles