Cine writer machcha ravi bv subramanyam driving licence cancelled drunk and drive case

machcha ravi news, cine writer machcha ravi news, writer bv subramanyam news, movie writer bv subramanyam, machcha ravi drunk and drive case, machcha ravi case, bv subramanyam drunk and drive case

cine writer machcha ravi bv subramanyam driving licence cancelled drunk and drive case : police officials cancelled the driving licence of cine writer machcha ravi in drunk and drive case.

తాగి తందనాలాడిన ‘సినీ రైటర్’కి పోలీసుల ట్రీట్ మెంట్

Posted: 01/31/2015 12:27 PM IST
Cine writer machcha ravi bv subramanyam driving licence cancelled drunk and drive case

‘కుక్కతోక వంకర’ అన్నట్లుగా సినీ రచయిత బి.వి.సుబ్రమణ్యం అలియాస్ మచ్చరవి వ్యవహారశైలి వున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే చేసిన తప్పును సరిదిద్దుకోకుండా మళ్లీ మళ్లీ చేస్తూ తన అసమర్థతను చూపించుకుంటున్నాడు. రచయితగా వున్న తన ప్రతిష్టను దిగజార్చుకుంటున్నాడు.

గతంలో మచ్చరవి రెండుసార్లు డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన సంగతి విదితమే! మొదటిసారి పట్టుబడినప్పుడు పోలీసలు ఓ మోస్తరు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. దాంతో తన అలవాటును మార్చుకోక మరోసారి ఇదే కేసులో పట్టుబడ్డాడు. అప్పుడు మోతాదుకి మించి ఎక్కువ తాగినట్లు నిర్ధారించిన పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మరోసారి అలా చేయొద్దని తమదైన స్టైల్లో సూచించారు. అయితే.. అవేమీ పట్టించుకోకుండా రవి తన తాగుడు మాత్ర మార్చుకోలేదు. తాజాగా ముచ్చటగా మూడోసారి దొరికిపోయి.. పోలీసుల ట్రీట్ మెంట్’ని రుచి చూశాడు.

శుక్రవారం రాత్రి పోలీసులు జరిపిన తనిఖీల్లోలోనూ మచ్చలరవి మోతాదుకి మందు తాగినట్లుగా డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఈసారి వార్నింగ్ ఇవ్వకుండా డైరెక్ట్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. అతనికి 6 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్’ను రద్దు చేశారు. ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే.. రవితోపాటు పట్టుబడిన రతీష్ సింగ్, మరో వ్యాపారి డైవింగ్ లైసెన్సులను రద్దుచేసినట్లు ఆయన పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : machcha ravi drunk and drive  driving licence  

Other Articles