ఇందుగలడు, అందులేడని, సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు నారాయణడు అన్ని దేవుళ్ల ప్రస్తావన సందర్భంగా చెప్పుకోవడం పరిపాటే. కానీ ప్రస్తుత తరుణంలో దేశంలో ఏ రాష్ట్రంలో వెతికినా ఉగ్రవాదులు, తీవ్రవాదులు కనబడుతున్నారు. విచిత్రమేమిటంటే ఉగ్రవాదంలోకి ఇన్నాళ్లు చదువుకున్న యువకులు మాత్రమే ఆకర్షితులయ్యేవారు. కానీ తాజాగా వస్తున్న మార్పుల నేపథ్యంలో మహిళలు, యువతులు కూడా ఉగ్రవాదంపైవు అకర్షితువుతున్నారు. ఉగ్రవాద సంస్థలో చేరి ఉగ్రవాదులుగా మారుతున్నారు.
ఈ కోవాలోనే ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో హైదరాబాద్‌కు చెందిన యువతి చేరి.. అక్కడి అనుకున్నది తల్లకిందలు అయ్యే సరికి డామిట్ కథ అడ్డం తిరిగిందనుకుంటూ.. కుటుంబ సభ్యుల సాయంతో ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ నిఘా విభాగం గుర్తించింది. రెండు నెలలు పాటు ఇరాక్ లో వున్న యువతి చేతికి గన్ ఇస్తారనుకుంటే.. గరిట చేతిలో బెట్టారు. దీంతో చేసేది లేక ఇటీవలే తిరిగి వచ్చినట్లు సమాచారం.
ఆ యువతి కుటుంబం పదేళ్ళ కిత్రం హైదరాబాద్ నుంచి దోహా వెళ్లి అక్కడే స్థిరపడినట్లు తెలుస్తోంది. ఆమె వివరాలు తెలియటంతో యువతి చెప్పే విషయంలో నిజానిజాలను నిర్థారించేందుకు నిఘా విభాగం అధికారులు రంగంలోకి దిగారు. అమెను విచారిస్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్ నుంచి మరెవరైనా ఐఎస్‌లో చేరేందుకు వెళ్లారా? ఐఎస్‌లో చేరికలకు ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులెవరు అనే అంశాలపై నిఘా విభాగం దృష్టి సారించింది. ఈ యువతి ద్వారా ఐఎస్ఐఎస్లో చేరేందుకు యత్నిస్తున్న మరో ఆరుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవలి కాలంలో ఒక్క హైదరాబాద్ నుండే రెండు మూడు నెలల కాలంలో దాదాపు 42 మంది యువకులు వివిధ మార్గాల్లో వెళుతూ సరిహద్దుల్లో భద్రతా దళాలలకు పట్టుబడ్డారు. వీరే కాకుండా హైదరాబాద్‌కు చెందిన వైద్య విద్యార్థిని కూడా ఐఎస్ఐఎస్ సంస్థలో చేరేందుకు సిద్ధమై, ఇరాక్, సిరియాకు వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధపడినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళుతూ ఇప్పటికే సల్మాన్ మొయిద్దీన్ పట్టుబడి పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఉగ్రవాద కార్యకలాపాల్లోకి పెద్దఎత్తున యువతను ఆకర్షించేందుకు ఐఎస్ఐఎస్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో తెలంగాణ నిఘా విభాగం ఈ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులవుతున్న యువతను గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఐఎస్‌పై నిఘా కొనసాగిస్తున్న తెలంగాణ పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకొని ఆమె ద్వారా సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more