Kejriwal apologises to delhites

kejriwal apologises to delhites, kejriwal apologises to delhi voters, AAP leader Arvind Kejriwal, kejriwal apologises again to delhi voters, kejriwal promises not to quit again, kiran bedi, aap, aravind kejriwal, PM narendra modi, modi, amit shah,

AAP leader Arvind Kejriwal has once again apologised for his actions during his 49-day tenure as Chief Minister of Delhi last year and promised not to quit again.

ఢిల్లీ ఓటర్లకు మరోమారు కేజ్రీవాల్ క్షమాపణలు..

Posted: 02/01/2015 04:48 PM IST
Kejriwal apologises to delhites

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ఓటర్లకు ఆయన క్షమాపణలు చెప్పారు. గతంలో తనకు అధికారం అందివచ్చినా.. జన్ లోక్ పాల్ బిల్లు అమోదం కోసం ఢిల్లీలో ప్రజాపాలనను వదలిపెట్టానని, మరోమారు అలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడబోనంటూ ఆయన ఢిల్లీ వాసులకు క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ గతంలో చేసిన తప్పును పునరావృతం కానివ్వనని హామీ ఇచ్చారు.

గత ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టి 49 రోజుల పాలన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకెప్పుడు అలా చేయనని, ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మెజార్జీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు, ఫిబ్రవరి 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పూర్తిగా వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు.

 జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  arvind kejriwal  new delhi  bjp  narednra modi  

Other Articles