నూతన వాహనాల రిజిస్ట్రేషన్లకు రవాణా శాఖ అధికారులు కొత్త మెలిక పెట్టారు. మీ కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇక మీదట హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఖచ్చితంగా కోనుగోలు చేయాల్సిందే. లేని పక్షంలో మీ వాహనాల రిజిస్ట్రేషన్ వాయిదా పడుతుంది. అంటే హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ) ప్రాజెక్టును అధికారులు అనధికారికంగా నిర్బంధం చేశారు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు వెలువరించకుండానే అధికారులు దాని నిర్బంధ అమలును ప్రారంభించారు. ఇక నుంచి హెచ్ఎస్ఆర్పీ రుసుం చెల్లిస్తేనే వాహనం రిజిస్ట్రేషన్ అవుతుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే తొలుత హెచ్ఎస్ఆర్పీ ధరను ఆ సంస్థ కౌంటర్లో చెల్లించాలి. దాని చెల్లింపు పూర్తయిందని ఆన్లైన్లో పరిశీలించి అధికారులు నిర్ధారించుకున్న తర్వాతే వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ఈ నిర్ణయం పట్ల వాహనదారులు మండిపడుతున్నారు. హెచ్ఎస్ఆర్పీ విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించకుండానే అధికారులు దాన్ని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకి స్తున్నారు. ఢిల్లీలాంటి చోట్ల తక్కువ ధరకే ఈ ప్లేట్లను సరఫరా చేస్తుండగా, తెలంగాణలో ఎక్కువ ధర ఖరారు చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more