Air india aviation sector general secretary somasundaran flight staff face pay cut off

air india news, air india staff, air india staff salary, Somsundaran General Secretary of aviation sector, air india associations, air india flights, air india flight timings, aviation sector, airports

air india aviation sector general secretary somasundaran flight staff face pay cut off : Somsundaran who is General Secretary of aviation sector warns air india staff to come airports as early as possible. If not they will cut their salary.

ఎయిరిండియా సిబ్బందికి ‘లేట్’ వార్నింగ్

Posted: 02/02/2015 11:21 AM IST
Air india aviation sector general secretary somasundaran flight staff face pay cut off

విమానయానరంగంలో సేవలందించడంతోపాటు అన్నివిభాగాల్లో ముందుగా వుంటూ ఒక ప్రత్యేకస్థానం ఏర్పరుచుకున్న ఎయిరిండియా విమానాలు.. ఒక్క విషయంలో మాత్రం పూర్తిగా వెనుకబడి వున్నాయి. అదే ‘ఆలస్యం’! ఇటీవలి కాలంలో ఈ ఎయిరిండియా విమానాలు సమయానికి రాకుండా చాలా ఆలస్యమవుతున్నాయి. కొన్నిసార్లు ప్రయాణికులు ఈ వినామాలకోసం గంటలతరబడి వేచి వుండాల్సి వస్తుంది. ఇది కేవలం ప్రయాణికులకే కాదు.. విమానయానరంగానికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఇలా తమ విమానాలు ఆలస్యం కావడంపై ఎయిరిండియా సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎయిరిండియాలో పనిచేస్తున్న సిబ్బంది విధులకు ఆలస్యంగా హాజరుకావడం వల్లే తమ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని సంస్థ ఆగ్రహించింది. అందుకే.. ఇక నుంచి సిబ్బంది ఆలస్యంగా వస్తే వారి జీతాల్లో కోతలు పెడతామని వారిని హెచ్చరించింది. ఈమేరకు ఆదేశాలను పౌరవిమానయాన రంగం ప్రధాన కార్యదర్శి సోమసుందరన్ జారీ చేశారు. ఈ ఆదేశాలు పైలట్లకు, కేబిన్ సిబ్బంది, ఇంజనీరింగ్ స్టాఫ్కు వర్తిస్తుందని ఆయన తెలిపారు. అంతేకాదు.. క్యాటరింగ్ చేసే వారి వల్ల కూడా ఆలస్యం అవకూడదని నిబంధనలు విధించారు. ఆలస్యానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు లేవని తేలిన తర్వాతే సిబ్బందికి పూర్తి జీతాలు ఇవ్వాలని ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

ఇటీవలే సోమసుందరన్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థల్లో ఎయిరిండియా విమానాలే ఎక్కువగా ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఉంచామని ఎయిర్ ఇండియా కార్యదర్శి అన్నారు. అన్ని ఎయిర్ పోర్టులకూ దీన్ని అమలు చేయనున్నారు. ఈనెల 1 నుంచి వీటిని అమలు చేసే అవకాశాలు వున్నాయి.

ఇదిలావుండగా.. ఈ నిబంధనలపై సీనియర్ ఉద్యోగులు తీవ్రంగా మండిపాటు వ్యక్తం చేస్తున్నారు. సమయానికి విమానాలు రాకపోతే అందుకు జీతాల్లో కోత విధించడం సమంజసం కాదని తెలిపారు. ప్రభుత్వం ఎయిర్ ఇండియా ఉద్యోగుల పరిస్థితిని అర్థం చేసుకుని, వారికి వీలుగా సమయాన్ని కేటాయించాలన్నారు. ప్రయాణంలో అనుకోకుండా ఆలస్యమయ్యే అవకాశముంటుందని వారు బోర్డుకు తెలిపారు. కేబిన్ సిబ్బంది కొరతవల్లే విమానాల ఆలస్యానికి కారణమవుతున్నాయని పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air india staff  aviation sector  Somsundaran General Secretary  airports  

Other Articles