Bjp party agarwal community controversial ad arvind kejriwal news

bjp election campaign ads, arvind kejriwal news, delhi election news, delhi assembly elections, arvind kejriwal comments, bjp election advertisements, bjp controversial ads, arvind kejriwal kiran bedi, arvind kejriwal delhi elections, arvind kejriwal elections campaigns

bjp party agarwal community controversial ad arvind kejriwal news : the bjp party has released another controversial ad against kejriwal and agarwal community which goes viral in delhi.

బీజేపీ మరో సంచలన ప్రకటన.. అగర్వాల్ కమ్యూనిటీకి అవమానం

Posted: 02/02/2015 12:25 PM IST
Bjp party agarwal community controversial ad arvind kejriwal news

ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ, బీజేపీ పార్టీలు పోటాపోటీగా దూషించుకుంటున్న విషయం తెలిసిందే! వీరిలో బీజేపీ అయితే తమదైన విధానంలో కేజ్రీపై వ్యతిరేక పోరాటం కొనసాగిస్తోంది. అరవింద్ మాటలతో తూటాలు పేలుస్తుంటే.. బీజేపీ ప్రకటనల ద్వారా సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలే ఈ పార్టీ కేజ్రీవాల్’కి వ్యతిరేకంగా తయారుచేసిన ప్రకటనలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే! అందులో అన్నాహజారే చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన చనిపోయినట్లుగా చిత్రీకరించారు. దీంతో ఆగ్రహించిన కేజ్రీ వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందిగా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ బహరింగంగా క్షమాపణ చెప్పాలంటూ సూచించింది. అయితే.. ఎన్ని విమర్శలొచ్చినా తాము మాత్రం మారంటూ బీజేపీ తన దుందుడుకు వ్యవహారం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ‘అగర్వాల్ కమ్యూనిటీ’ని కించపరిచేవిధంగా ఓ పోస్టర్’ను విడుదల చేసింది.

బీజేపీ విడుదల చేసిన ఈ పోస్టర్’లో కేజ్రీవాల్’పై విరుచుకుపడుతూ ఆయన జనవరి 26వ తేదీకి ముందు చేసిన ధర్నాలో తనకు రిపబ్లిక్ డే ఇన్విటేషన్ కావాలంటూ చేసిన డిమాండ్ గురించి ప్రస్తావించింది. ‘‘నేను చెప్పినట్లుగా వినకపోతే రిపబ్లిక్ డే వేడుకలకు భగ్నం కలిగిస్తాను’’ అని కేజ్రీవాల్ అన్నట్లుగా ఆ పోస్టర్’లో ప్రచురించారు. అలాగే ఓ ఏడాదిపాటు వీఐపీ పాస్ కోసం తాను అప్పీల్ చేస్తున్నట్లుగా కేజ్రీకి వ్యతిరేకంగా రాశారు. గతంలో కేజ్రీవాల్ వీఐపీ పాస్’ను రద్దు చేస్తానంటూ పేర్కొని తర్వాత పాటించడంపై ఈ విధంగా ఈ పోస్టర్’లో ప్రచురించారు. ఇంతవరకు కేజ్రీని విమర్శించడం బాగానే వుంది కానీ.. ఆ పోస్టర్’లోనే చిన్న అక్షరాలతో పొందుపరిచిన వ్యాసంలో కేజ్రీవాల్ ‘ఆప్కా ఉపద్రవీ గోత్ర’ అంటూ పేర్కొంది. ఇప్పుడదే ఢిల్లీలో పెను సంచలనంగా మారింది. ఇదే విషయమై కేజ్రీవాల్ తనదైన రీతిలో బీజేపీపై వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు మొదలుపెట్టేశారు.

ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ట్విటర్’లో... ‘‘అసలు బీజేపీ పార్టీకి ఏమయ్యింది? మొదట వాళ్లు నా పిల్లలపై ఆరోపణలు చేశారు. అప్పుడు నేను ఊరికే వున్నాను. అన్నా అంటుంటారు.. అవమానాన్ని భరించే శక్తి వుండాలని! నేను సమాజానికి వ్యక్తిగత అమర్యాదగా ఎప్పుడూ ప్రతిస్పందించలేదు. కానీ నేను బీజేపీ ప్రకటలు మరీ పరిమితులు దాటుతున్నాయి. నేడు బీజేపీ మొత్తం అగర్వాల్ కమ్యూనిటీని ‘ట్రబుల్ మేకర్’ (రౌడీలు, పోకిరీలు)గా అభివర్ణించింది. నా తెగను ‘వికృత తెగ’ అంటూ తెలిపారు. బీజేపీ నాకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించవ్చు కానీ.. అగర్వాల్ కమ్యూనిటీని ఏ విధంగా టార్గెట్ చేసి వారిని అవమానిస్తోంది? అసలా హక్కు బీజేపీ పార్టీకి ఎవరిచ్చారు? బీజేపీ ఇప్పుడు జాతిదాడులను అవలంభించింది. ఇందుకు వారు అగర్వాల్ కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పాల్సిందే’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

చివరగా.. బీజేపీ వైఖరిపై తాము ఎలక్షన్ కమిషన్’కు ఫిర్యాదు చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఈ విధమైన జాతివివాద రాజకీయాలను ఎప్పటికీ ఇష్టపడరు. ఓటింగ్ రోజున ప్రజలు బీజేపీకి సరైన సమాధానం చెబుతుందంటూ ఆయన వెల్లడించారు. అలాగే.. అగర్వాల్ కమ్యూనిటీ కూడా బీజేపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం! ‘‘పార్టీ అధికారంలో వుంది కదా ఏది చేస్తే చెల్లుతుందని భావించడం తెలివితక్కువ పని’’ అంటూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకా ఇటువంటి వివాదాలు తెరపైకి ఎన్ని వస్తాయో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles