హాలీవుడ్ నటి, ఫిల్మ్ మేకర్ ఏంజెలీనా జోలీకి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. టైటానిక్ సినిమాతో హాలీవుడ్ వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. నాలుగు పదుల వయసులోనూ తన నిత్యనూతన అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కట్టిపడేస్తూ.. ప్రపంచ అభిమాన మహిళగా నిలిచింది. హాలివుడ్ చిత్రసీమలోకి బాలనటిగా అడుగుపెట్టి.. హాకర్స్ అనే చిత్రంతో బ్రేక్ సంపాదించి ఇరవై వసంతాలు కావస్తున్నా.. ఏంజెలీనా పట్ల ప్రపంచవ్యాప్తంగా తరగని ఆదరణ కనిపిస్తోంది. తాజాగా ఈమె ప్రపంచ ఆరాధ్య మహిళగా నిలిచింది. వెబ్ ఆధారితంగా జరిగిన ఒక పోల్ లో అనేక మంది మహిళామణుల మధ్య ఏంజెలీనాను ఆరాధ్యమైన మహిళగా నిలిపారు అభిమానులు.
23 దేశాలకు చెందిన దాదాపు పాతికవేల మంది నెటిజన్లు పాల్గొన్న యువ్గోవ్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో ఏంజలినా టాప్ ప్లేస్ లో నిలిచారు. ఇటీవలే నోబెల్ పురస్కారాన్ని పొందిన యూసూఫ్ మలాలా సహా, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా, బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ , కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులందరి కన్నా ఈ పోల్ లో ఏంజెలీనా కే ఎక్కువ ఆదరణ కనిపించింది.
ఏంజెలినా జోలికి అగ్రస్థానంలో నిలువగా, నోబుల్ శాంతిపురస్కార గ్రహీత మలాలా రెండో స్థానలో నిలచింది. హిల్లరీ క్లింటన్, క్వీన్ ఎలిజబెత్ , మిషెల్ ఒబామాలు క్రమంగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అమెరికా టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్ ఫ్రే, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్, రాజకీయ వేత్త అంగ్ సన్ సూకీ లు కూడా టాప్ 10 లో నిలిచారు. పురుషుల విభాగంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more