Andhra pradesh cm chandrababu naidu leaders of trade unions meeting capital city

chandrababu naidu, leaders of trade unions, chandrababu meeting, andhra pradesh capital city, ap capital city news, hyderabad city news, chandrababu latest news, ap minister narayana, singapore ministry, chandrababu tour

andhra pradesh cm chandrababu naidu Leaders of trade unions meeting capital city : ap cm chandrababu naidu had expressed his feelings about ap government in leaders of trade unions meeting.

హైదరాబాద్’లో వుంటే.. వేరే దేశంలో ఉన్నట్లుంది!

Posted: 02/04/2015 10:21 AM IST
Andhra pradesh cm chandrababu naidu leaders of trade unions meeting capital city

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలగా విభజించబడిన అనంతరం హైదరాబాద్ నగరాన్ని 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధానిగా నియమించబడిన విషయం తెలిసిందే! విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్’లో రాజధాని నగరం లేకపోవడం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు లేనియెడల ఇలా చేయడం జరిగింది. దీంతో.. ఆంధ్రరాష్ట్ర అధికార పార్టీ టీడీపీ అన్ని ప్రభుత్వం కార్యక్రమాలను హైదరాబాద్’లో వుండి నిర్వర్తించుకుంటున్నారు. అయితే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడినా కూడా తెలంగాణాలోనే వుంటూ ఆంధ్ర ప్రభుత్వ కార్యాలను చేపట్టడం, అసెంబ్లీ సమావేశాలు, సచివాలయం లాంటి నిర్మాణాలు లేకపోవడం వల్ల చాలా బాధాకరంగా వుందని గతంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇప్పుడు తాజాగా అదే తరహాలోనే మరోసారి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్’లో వుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించడం విదేశాల్లో వుండి పాలన సాగిస్తున్నట్లు వుంది’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎంతవీలైతే అంత త్వరగా తెలంగాణ నుంచి నవ్యాంధ్రకు వెళ్లిపోవాలని, అక్కడ కావాల్సిన ప్రభుత్వ కార్యకలాపాలను అన్నింటినీ త్వరగా నిర్మించాలని, ఈ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా వుందని ఆయన ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేశారు. ఇందుకు మీరంతా సహకరించాలంటూ ఆయన ఉద్యోగ సంఘాల నేతలతో వేడుకున్నారు. పైగా వారిలో 3000 మందికి ప్రత్యేక గృహవసతి కూడా ఆంధ్రరాష్ట్రంలో కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం!

ఈ సమావేశ నేపథ్యంలోనే సింగపూర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడలకు అవకాశాలు వున్నాయని స్పష్టం చేశారు. ఆయన ఆ బృందంతో సమావేశమై రాజధాని, అభివృద్ధిపై సమీక్షించారు. ఇక మంత్రి నారాయణ మాట్లాడుతూ.. జూన్ ఏడోతేదీనాటికి కొన్ని కమిషనరేట్లు తాత్కాలిక రాజధానిగా తరలిస్తామని  చెప్పారు. అంటే.. ఏపీ ప్రభుత్వం రాజధాని విషయంపై వేగవంతమైన చర్యలు తీసుకుంటోందన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrabau naidu news  ap capital city  tdp ministers  

Other Articles