Isis is the enemy of islam says asaduddin owaisi

isis enemy of islam, islamic state of iran and syria, owaisi gives call to youth, educated youth never fall in trap of isis, hyderabad mp asududdin owaisi, moulanas, jihad means not violence, jihad described by moulanas, isis traps youth through internet,

islamic state of iran and syria is the enemy of islam, never attract to their postings in internet says hyderabad mp asududdin owaisi

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం.. ఇస్లాంకు పెద్ద శత్రువు..

Posted: 02/06/2015 10:52 AM IST
Isis is the enemy of islam says asaduddin owaisi

మతం పేరుతో ఉద్వేగానికి లోనే చేసే ప్రకటనలను నమ్మవద్దని,  జీహాద్ అంటే రక్తపాతం, విధ్వంసం అంటూ అంతర్జాలంలో పెద్దఎత్తున జరుగుతున్న వ్యతిరేక ప్రచారాలు నిజం కాదని.. జీహాద్ పేరిట యువత తప్పుదారి పట్టడం సరికాదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ యువతకు హితవు పలికారు. వారికి జీహాద్ చేయాలనే భావనే ఉంటే తమ తమ బస్తీ పరిసరాల్లోని సమస్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తిచేశారు. ఎంతో విజ్ఞానం వున్న చదువుకున్న వారే జీహాద్ అంటూ తప్పుడు ప్రచారానికి ఆకర్షితులు కావడం పట్ల ఆయన అందోళన వ్యక్తం చేశారు.

నగరంలోని జామియా నిజామియాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇస్లాంకు ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా) ప్రధాన శత్రువన్నారు. ఐఎస్‌ఐఎస్‌తో ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ వాదం ఒక దగా, మోసమని చెప్పారు. ఇస్లాం పేరిట రక్తపాతం సృష్టించడం సహించరానిదన్నారు. జీహాద్ పేరిట ఇంటర్నెట్, మొబైల్‌లలో కనిపించే సమాచారం చూసి యువత  దారితప్పుతోందని ఇది అందోళన కరమన్నారు. ఉగ్రవాది హఫీజ్ సయీద్ లాంటి సంఘ విద్రోహ శక్తులు పొందుపరచిన సమాచారమే అందులో ఉంటుందన్నారు.

అంతర్జాలంలో వున్న ఉద్వేగభరిత సమాచారంతో యువతలో మార్పుకు కారణమవుతుందన్నారు. మరోవైపు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదానికి మన దేశానికి ఎలాంటి సంబంధం లేదని, అలా వుంటే ఐఎస్ ఐఎస్ లోకి వెళ్లిన యువత ఎందుకు తిరగివస్తారని ఒవైసీ ప్రశ్నించారు. బయటకు కనబడే రంగులకు.. లోనకు వెళ్తే వుండే పరిస్థితులకు చాలా తేడా వుందన్నారు. జీహాద్‌కు స్పష్టమైన నిర్వచనాన్ని మతగురువులు మౌలానాలను సంప్రదిస్తే  తెలుస్తుందన్నారు. నిజంగా జీహాద్ చేయాలనుకుంటే యువత తమ తమ బస్తీ పరిసరాల్లోని చెడు సమస్యలపై దృష్టి సారించాలని అసదుద్దీన్ కోరారు. ప్రజాస్వామిక దేశంలో మత స్వేచ్ఛను ఆపడం ఎవరి తరంకాదన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jihad  islamic state  asaduddin owaisi  moulanas  

Other Articles