రెండు అక్షరాల ప్రేమ.. అదీనూ పాలిటెక్నిక్ చదివే వయస్సులో అంటే నూనూగు మీసాల నూత్న యవ్వనములో.. ఎలా వుంటుందో తెలుసా.. యావత్ ప్రపంచమే ఎదురోచ్చి నిలిచినా జయించగలనన్న ఆత్మ విశ్వాసం. ప్రేయసి కోసం ఏదైనా జయించ వచ్చనూ నమ్మకం.. ఎంతైనా సాధించవచ్చునన్న మనోధైరం. అందులోనూ ఏడాదికి ఓ సారి వచ్చే అరుదైన ప్రేమికుల రోజున బహుమతి ఇవ్వకుండా వుండగలరా..? ఎంత ఖర్చైనా పర్వాలేదు.. ఎవరి కోసం అలోచించకుండా గిఫ్ట్ అన్నది మాత్రమే మదిలో మెలుగుతుంది.
అయితే ఇలాంటి ఓ జైపూర్ కుర్రాడు శైలేంద్ర పరిహార్.. ప్రస్తుతం పాలిటెక్నిక్ చదువుతూ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తన ప్రియురాలికి వాలెంటైన్స్ డే కానుక ఇవ్వాలనుకున్నాడు. కానీ గిప్ట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో.. ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన తన స్నేహితుడు వీరేంద్ర గంగ్వార్కు విషయాన్ని చెప్పాడు. గిప్ట్ కొనేందుకు డబ్బులతో పాటు ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తాను రమ్మన్న స్నేహితుడి అంతరార్థాన్ని శైలేంద్ర పరిహార్. గమనించకుండానే బరేలీలో వాలిపోయాడు.
జైపూర్ నుంచి వచ్చిన పరిహార్కి తన స్నేహితుడంటూ ఫరుఖాబాద్కు చెందిన మోను పాల్ను వీరేంద్ర పరిచయం చేశాడు. పాల్కు ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షలలో భాగంగా మెడికల్ పరీక్ష ఉందని, అతడికి బదులుగా ఆ పరీక్ష రాస్తే రూ.5000 వేలు ఇస్తాడని పరిహార్ను వీరేంద్ర గంగ్వార్ ఒప్పించాడు. ఎలాగైనా ప్రియురాలికి గిప్ట్ ఇవ్వాలనుకుంటున్న పరిహార్ వారితో డీల్ కుదుర్చుకున్నాడు. ఫిబ్రవరి 4వ తేదీన పరీక్ష రాసేందుకు పాల్కు బదులుగా పరిహార్ వెళ్లాడు. ఒరిజనల్ సర్టిఫికెట్లలో ఉన్న సంతకానికి పరీక్ష సమయంలో చేసిన సంతకం తేడాగా ఉండటంతో ఇన్విజిలేటర్లకు అనుమానం కలగడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
తానెవ్వరన్న వివరాలు పోలీసులకు చెప్పందుకు నిరాకరించిన పరహార్.. ఫోటోను టీవీలో చూసిన అతని సోదరుడు బరేలికి రావటంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు. ప్రియురాలికి ఏదైనా కానుక ఇవ్వాలని అనుకుంటున్న తరుణంలో మంచి అవకాశం వచ్చిందని భావించి ఈ పని చేశానని పరిహార్ తన తప్పును అంగీకరించాడు. ఐపీసీ సెక్షన్లు 420, 467, 468 కింద ప్రియుడు పరిహార్పై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు బరేలీ నగర ఎస్పీ రాజీవ్ మల్హోత్రా తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more