Delhi elections 2015 major competition aap vs bjp

delhi elections 2015, aap, kejriwal, kiran bedi, amith sha, assembly elections 2015

delhi elections 2015 major competition aap vs bjp: delhi elections are different from last time. in this time aap and bjp fight with full effort. this elections are specifically only bitween aap and bjp. there is no gain or loss to congress in this delhi elections.

ఢిల్లీ వై"భోగం" ఎవరిదో..?

Posted: 02/06/2015 05:43 PM IST
Delhi elections 2015 major competition aap vs bjp

ఢిల్లీ ఎన్నికల ప్రచారం ఎంతో హోరాహోరీగా సాగింది. ఎన్నికల ప్రచారానికి బిజెపి పార్టీ తరఫున ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా పాలుపంచుకున్నారు. ఆప్ ను ధీటుగా ఎదుర్కోవడానికి బిజెపి అనూహ్యంగా కిరణ్ బేడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కిరణ్ బేడి బిజెపి చేరికతో ఎన్నికల వేడి పెరిగింది. ఢిల్లీలోని 70 స్థానాలకు గాను జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, ఆప్ లు నువ్వా నేనా అన్నంతగా ప్రచారం చేశాయి.

ఢిల్లీ లోని ప్రతి గడపకు తమ పార్టీ సందేశాన్ని తీసుకెళ్లగలిగారు. ఢిల్లీ ఎన్నికల సరళి గత ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీపై అన్నా హజారే ఉద్యమ ప్రభావం గట్టిగానే ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. గతంలో ఒక సారి ఆప్ కు అధికారాన్ని అప్పజెప్పినా, దాని నిలబెట్టుకోవడంలో కే్జ్రీవాల్ విఫలమయ్యారు. ఇప్పుడు మాత్రం గతంలో తాను చేసిన తప్పు చెయ్యను అంటూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ పార్టీది మాత్రం విచిత్ర పరిస్థితి. దేశం మొత్తంలో భారీ మొజార్టీతో ప్రభుత్వాన్ని నెలకొల్పినా ..ఇప్పుడు ఢిల్లీ లో మాత్రం అధికారంలోకి రాకపోతే అది బిజెపికి ఎంత మాత్రం మంచిది కాదు. పైగా ఇప్పటి ఎన్నికల్లో ప్రధాన పోటీ కేవలం బీజెపీ, ఆప్ ల మధ్యనే అన్నది బహిరంగ రహస్యం.

ఇక ఢిల్లీలో ఎన్ని సీట్లు వచ్చినా, అసలు రాకపోయినా కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మీడియా కనీస ప్రచారాన్ని కూడా కల్పించకపోవడం పరిస్థితికి అద్దంపడుతోంది. మొత్తానికి ఢిల్లీ పీఠం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మాత్రం  వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi elections 2015  aap vs bjp  bjp  aap kejriwal  

Other Articles