ప్రభుత్వం మారింది...పాలన విధానం మారింది...ప్రజల జీవితాల్లోనూ మార్పు రావాలి. అందులో భాగంగానే నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రణాళికల స్థానంలో నీతి ఆయోగ్ ను ప్రవేశపెడుతున్నారు. ఆగష్టు 15 న ఎర్రకోట సాక్షిగా మోదీ ప్రణాళిక సంఘానికి కాలం చెల్లిందని ప్రకటించారు. తాజాగా దాని స్థానంలో కొత్తగా నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోవియట్ రష్యాను ఆదర్శంగా తీసుకొని ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు నాటి ప్రధాని నెహ్రూ. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినా ప్రణాళిక సంఘం తన లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం విజయం సాధించలేదు. కొన్ని ప్రణాళికలు విజయవంతమైనా మొత్తంగా మాత్రం విఫలమయ్యాయనే చెప్పాలి. అప్పటి పరిస్థితులకు అనుకూలంగా ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటుచేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత చూపింది. లోపాలుంటే సవరించాలి కానీ మొత్తంగా తీసివెయ్యడం ఏంటని ఆక్షేపించింది. అయినా మోదీ ప్రభుత్వం మాత్రం ప్రక్షాలనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది.
1951లో ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం తన విధులను నిర్వహించడంలో ఎంతో వెనుకబడిందని, అందుకే అన్ని ప్రణాళికలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయని ఆరోపణ ఉంది. అయితే ప్రారంభంలొ మొదటి రెండు ప్రణాళికలు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంతో...ప్రణాళికల ఫలితంగా 15 నుండి 20 సంవత్సరాల్లోనే దేశం అభివృద్ది పథం వైపు చేరుకుంటుందని అందరూ భావించారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. తరువాతి ప్రణాళికలు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చెయ్యడంలో జాప్యం చెయ్యడంతో ప్రణాళికలు విఫలమయ్యాయి.
2014 సాధారణ ఎన్నికల్లో పూర్తి మెజార్టీతొ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ ప్రభుత్వం వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా దేశ ప్రగతికి సహాయపడు విధంగా నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భాగస్వామ్యం కల్పిస్తారు. ఇందులో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల అటార్నీ జనరల్ లు, గవర్నర్ లు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో పారదర్శకంగా ఉండేందుకు వీలుకల్పిస్తోంది నీతి ఆయోగ్. ప్రణాళిక సంఘం తరహాలోనే దీనికి కూడా ప్రధాన మంత్రి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. గతంలో మాదిరిగా నిధుల విడుదలలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా జవాబుదారితనాన్ని కలిగి వుంటుంది.
ప్రణాళిక సంఘం నిర్ణయాల్లో ఎంతో జాప్యం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక సంఘం విధుల్లో మార్పులు రాకపోవడం వల్లే ప్రణాళిక సంఘాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు తగినట్లు పూర్తి స్థాయి మార్పులతో రాబోతోంది నీతి ఆయోగ్. దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా ముందుకు రాబోతోన్న నీతి ఆయోగ్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొత్త ఆలోచనలతో దూసుకుపోతున్న మోదీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ ను కూడా ఎంతో విజయవంతంగా నడిపిస్తుందని పరిశీలకుల భావన.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more