Lady teaches a lesson to eve teaser in railway station

Lady teaches lesson to eve teaser, Lady teaches lesson to pivot, eve teasing, eve teaser in railway station, lady teaches lesson, badrachalam, manuguru, women mandling

Lady teaches a lesson to eve teaser in Railway Station

ITEMVIDEOS: మద్యం మత్తులో వెకిలి చేష్టలు.. దేహశుద్ది చేసిన యువతి

Posted: 02/06/2015 07:30 PM IST
Lady teaches a lesson to eve teaser in railway station

మద్యం మత్తులో జోగుతున్న ఓ పోకిరికీ.. రైలు కోసం వేచి చూస్తున్న ఓ ఒంటరి యువతి కనింపించింది. మంచి తరుణం మించిన దోరకదని భావించాడు ఓ పోకిరీ.. అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించటమే కాదు... మీద చేయి కూడా వేశాడు. అయితే ఒంటరిగా ఉన్న యువతి మిమాంసలో పడింది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలోకి జారుకుంది. బాధను మౌనంగా భరించింది. కానీ. ఏం చేసినా ఏమీ అనడం లేదు.. ఏమైనా చేసుకోవచ్చనని అనుకున్న పోకిరి వెకిలి చేష్టలు మొదలుపెట్టాడు. అప్పటి వరకు అణుచుకున్న తన కోపాన్ని ఒక్కసారిగా ప్రదర్శించింది. మహాకాళీగా రెచ్చిపోయింది. అంతే మన మద్యం బాబు మందు మత్తు మొత్తం వదిలింది. వివరాల్లోకి వెళ్లితే..

ఖమ్మం జిల్లా భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్‌లో రామవరానికి చెందిన ఓ యువతి... హైదరాబాద్‌ వెళ్లేందుకు.. మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ కోసం వేచి ఉంది. రైల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో మరో రైలు ఎక్కేందుకు ఫ్లాట్‌ ఫాంపై కూర్చుంది. ఇది గమనించిన ఓ యువకుడు మద్యం మత్తులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. ఆమెపై చేయి వేశాడు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి.. పోకిరీపై తిరగబడింది. నాలుగు మాటలు అని.. ఆ తరువాత నలుగురూ చేరే సరికి ధైర్యాన్ని కూడగట్టుకుని నాలుగు ఉతుకులు ఉతికింది.

ఈ విషయాన్ని గమనించిన  స్థానికులు కూడా యువతికి మద్దతుగా నిలిచారు. మందుబాబును.. మత్తు దిగేలా చితక్కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లి... రైల్వేస్టేషన్‌కు చేరుకుని.. పోకిరికి నాలుగు తగిలించింది. మద్యం మత్తులో ఉన్న పోకిరీ బాబు... రైల్వే పోలీసులతో కూడా వాదులాటకు దిగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీస్‌ బాబాయ్‌లు.. కాళ్లు, చేతులకు పని చెప్పారు.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : eve teaser  badrachalam  manuguru  women mandling  

Other Articles