India reacts strongly to obama concern

india reacts strongly to obama concern, india reacts to barack obama intolerance, narendra modi,Two senior Union ministers react on obama concern, Arun jaitley, Rajnath singh, Mahatma Gandhi, Barack Obama, Dalai Lama, His Holiness The Dalai Lama, India, Indian culture, NewDelhi, Washington

Reacting cautiously to US President Barack Obama's concern about religious "intolerance" in India, government on Friday said any "aberrations" do not alter India's history of tolerance.

ఒబామా వ్యాఖ్యాలపై ధీటుగా స్పందించిన భారత్

Posted: 02/07/2015 01:32 PM IST
India reacts strongly to obama concern

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన మత వ్యాఖ్యలకు భారత దేశం ధీటుగా స్పందించింది. భారత్‌లో ఇప్పుడు ఉన్న మత అసహనాన్ని చూసి ఉంటే జాతిపిత మహాత్మా గాంధీ దిగ్భ్రాంతి చెంది ఉండేవారన్న ఒబామా సంచలన వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్‌లు ధీటుగానే స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు సహజంగానే సహనం కలిగిన భారత దేశ చరిత్రను మార్చలేవని చెప్పారు. భారత దేశం వివిధ మతాలు, వివిధ సంస్కృతులు కలిగి ఉన్న దేశమని కేంద్రమంత్రులు వ్యాఖ్యానించారు. ఇక్కడ ముస్లీంలు, జ్యూస్, పారిస్, క్రిస్టియన్స్.. ఇలా అందరు ఉన్నారని చెప్పారు.

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. మతసహనాన్ని ప్రతి ఒక్కరి అంగీకరించాల్సిందేనని చెప్పారు. భారత దేశానికి సహనం ఉందనేందుకు ఇక్కడి వివిధ సంస్కృతులే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఒబామా వ్యాఖ్యలు దేశ చరిత్రను మార్చలేవన్నారు. ప్రపంచంలోనే భారత దేశంలో వివిధ మతాలు ఉన్నాయని రాజ్ నాథ్ సింగ్ ఉత్తరాఖండులో అన్నారు. ఇక్కడ ముస్లీంలు, క్రిస్టియన్లు ఉన్నారని, పార్సీలు, జ్యూస్‌లు కూడా ఉన్నారని చెప్పారు. భారత దేశానికి ఉన్న మరో ఔన్నత్యం.. మతం, కులం, కమ్యూనిటిని బట్టి ఇక్కడ వివక్ష లేకపోవడమన్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్, చైనాలు భావించినట్లుగా ఒబామా భారత్ పైన యూ టర్న్ తీసుకున్నారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arun jaitley  rajnath singh  barack obama  mahatma gandhi  

Other Articles