Syreia battle 2 lakh people died

syreia battle, syreia war, rebals in syreia, people in syreia, president asad

syreia battle 2 lakh people died : in syreia around 2 lakh people died. a briton based human rights survey reveal the details.

2.10 లక్షలు....అంకెలు కావు చావులు

Posted: 02/09/2015 01:41 PM IST
Syreia battle 2 lakh people died

సిరియాలో జరుగుతున్న అంతర్యుద్దంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య అక్షరాల 2 లక్షల 10 వేలు. సిరియాలో గత కొంత కాలంగా రాజుకుంటున్న అంతర్యుద్దానికి బలైపోయిన జనాభా ఇది. సిరియాలో జరుగుతున్న మానవహోమానికి ఈ లెక్కలు ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్న దాష్టీకానికి అక్షర రూపం 2 లక్షల మంది చావులు. బ్రిటన్ కేంద్రంగా సిరియా అంతటా నిర్వహించన సర్వే ఈ వివరాలను వెల్లడించింది. మృతుల్లో 10,664 మంది చిన్నారులు, 6,783 మంది మహిళలు ఉన్నారు. 35,827 మంది సిరియా రెబల్స్ , 45,385 మంది సైన్యంలోని వారు మరణించారని తెలిపింది. కాగా క్షేత్ర స్థాయిలో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు హక్కుల కమిటి చైర్మెన్ రమీ అబ్దుల్ రహ్మాన్ తెలిపారు.

గత కొంత కాలంగా అంతర్యుద్ధంతో సిరియా మండిపోతోంది. బాత్‌ ప్రభుత్వ దళాలు., ఫ్రీ సిరియన్‌ ఆర్మీ మధ్య సంవత్సరాలుగా సాగుతున్న పోరు ఎంతకీ ఆగడం లేదు. అల్‌ అసద్‌ గద్దె దిగాలంటూ మొదలైన ఆందోళనల్లో వేలాది అమాయకులు అసువులు బాసారు. అరబ్‌ ప్రపంచాన్ని కుదిపేసిన స్వతంత్ర ఉద్యమాల బాటలో 2011 మార్చి 15న మొదలైన ఆందోళనలు ఇంకాకొనసాగుతున్నాయి. సిరియన్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు నిరసనకారులపై విరుచుకుపడుతున్నాయి. మరో వైపు ఆందోళనకారులకు టర్కీ, సౌదీ అరేబియా, ఖతార్‌, అమెరికా, ఇంగ్లాంగ్‌, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌లు మద్దతుగా నిలిస్తే బాత్‌ పార్టీ ప్రభుత్వానికి ఇరాన్‌, రష్యాలు బాసటగా నిలిచాయి. మూడున్నర లక్షల సైన్యమున్న సిరియన్‌ ప్రభుత్వ దళాలతో లక్షలోపు బలమున్న తిరుగుబాటుదారులు, ముజాహిదీన్లు తలపడుతున్నారు. ఇలా ఉదృతంగా సాగుతున్న పోరులో ఇరువైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. ఆందోళనలు, నిరసనలతో సంబంధం లేని అమాయకులు  దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. నిరసనలు తెలుపుతూ వీధుల్లోకి వచ్చిన ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుడంటంతో భారీ ప్రాణనష్టం జరుగుతోంది.

సిరియాలో 1963లో బాత్‌ పార్టీ ఆవిర్భవించింది. రాజకీయ ప్రత్యర్ధులు, తిరుగుబాటు దారుల ఊచకోతలతో అధికారంలోకి వచ్చిన బాత్‌పార్టీ  చాలా సంవత్సరాలుగా తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తోంది. అంతర్యుద్ధాలు, దాడులు-ప్రతిదాడులు, హత్యాయత్నాలను తట్టుకుని బాత్‌ పార్టీలో ప్రస్తుత అధ‌్యక్షుడిగా అల్‌ అసద్‌ కొనసాగుతున్నారు. 1970లో అధికారంలోకి వచ్చిన హఫీద్‌ అల్‌ అసద్‌ వారసత్వాన్ని కొనసాగించడంలో అసద్‌ ముందున్నారు. 50ఏళ్లుగా మానవహక్కుల మాటన్నది లేకుండా పాలన సాగించడంతో గత ఏడాది అరబ్‌ ప్రపంచాన్ని కుదిపేసిన తిరుగుబాటు ఉద్యమాలు సిరియా ప్రజలకు కొత్త ప్రేరణ ఇచ్చాయి. టునిషియా, లిబియా, ఈజిప్ట్‌., యెమెన్‌లను కుదిపేసిన ఉద్యమాలపై అసద్ సానుకూలంగా స్పందించారు.కానీ దేశంలో జరుగుతున్న ఆందోళనలు అగ్రరాజ్యం కావాలని చేయిస్తోందంటూ అసద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : syreia war  syreia battle  syrian rebals  

Other Articles